Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు- గతంలో శివుడి గుడి అనడానికి 5 కారణాలు ఇవే!
Gyanvapi Mosque History: వారణాసిలో జ్ఞానవాపి మసీదును గతంలో కూలగొట్టిన శివాలయంపై నిర్మించారు అనడానికి 5 కారణాలను బలంగా వినిపిస్తున్నాయి హిందూ సంఘాలు. అవేంటో ఇక్కడ క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
What Is Gyanvapi Mosque Case: వారణాసిలో జ్ఞానవాపి మసీదును గతంలో కూలగొట్టిన శివాలయంపై నిర్మించారు అనడానికి 5 కారణాలను బలంగా వినిపిస్తున్నాయి హిందూ సంఘాలు. అందుకే జ్ఞానవాపి మసీదు (Gyanvapi Masjid) ప్రాంతంలో శివుడి గుడిని నిర్మించాలని కోరుతున్నారు. అది మసీదు కాదు, ఒప్పుడు శివాలయం అనడానికి హిందూ సంఘాలు చెబుతున్న కారణాలు, లేవనెత్తిన అంశాలు ఇక్కడ తెలుసుకుందాం.
పాయింట్ 1: మసీదు వైపు నంది చూపు..!
కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా సరే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అంతే కదా..! ఇక్కడ మసీదు పక్కనే ఉన్న ఆలయంలో మాత్రం నందీశ్వరుడు మసీదు వైపు చూస్తుంటాడు. అంటే.. గతంలో శివుడి విగ్రహం అటువైపు ఉందని అర్థమని హిందూ సంఘాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
పాయింట్ 2: మసీదు గోడలపై హిందూ దేవుళ్ల చిత్రాలు
సాధారణంగా మసీదు గోడలపై ఏమీ ఉండవు. కానీ, ఇక్కడ మసీదు గోడలను గమనిస్తే హిందూ దేవుళ్ల చిత్రాలు కనిపిస్తుంటాయి. సూర్యుడు, కమలం పువ్వుల గుర్తులు ఇక్కడున్న స్తంభాలపై కనిపిస్తున్నాయి. అంటే దానర్థం ఏంటీ..? ఇది నిజంగా ముస్లింల ప్రార్థనా మందిరం మసీదేనా? అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
పాయింట్ 3: మసీదు ఆవరణలో శివ లింగం
మసీదులో శివలింగం ఎవరైనా పెట్టుకుంటారా..! కానీ, ఇక్కడ ఉంది. దీనిని వాళ్లు వాటర్ ఫౌంటేన్ అంటున్నారు. కానీ, దాని ఆకారం మాత్రం లింగరూపంలోనే ఉంది. ఆ లింగం వైపే నందీశ్వరుడు చూస్తున్నారన్నది వారి వాదన.
పాయింట్ 4: హిందూ గుడిలా మసీదు నిర్మాణం
మసీదుకు నాలుగు మినార్లు ఉండాలి కానీ ఇక్కడ అవే స్థంబాలు ఉన్నాయి. మసీదు వెనుక భాగంలో ఇప్పటికీ గుడి నిర్మాణం పోలినది స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడై మసీదును హిందూ గుడిలా కడతారా..? అని హిందూ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి
పాయింట్ 5: బేస్ మెంట్ లో చారిత్రక ఆధారాలు
ఈ మసీదులో ఓ బేస్ మెంట్ ఉంది. అందులో శివాలయం గుడికి సంబంధించిన చాలా వస్తువులు, స్తంభాలు, శాసనాలు ఇలా చాలా ఉన్నాయన్నది హిందువుల వాదన. 1880 కంటే ముందు ఆ స్థలం తమ పూర్వీకుల పేర్ల మీదుగా ఉందని హిందూ మతానికి చెందిన సోమనాథ్ వ్యాస్ కుటుంబం డాక్యుమెంట్లు చూపిస్తోంది. ఈ నిర్మాణం పై భాగం మసీదు కానీ, గ్రౌండ్ అంతా హిందూవులదే. తమ పూర్వీకలు దగ్గరున్న డాక్యుకమెంట్లు అందుకు సాక్ష్యం అంటున్నారు.
ఆర్కిలయాజికల్ సర్వే రిపోర్టు
ఈ వాదనలపై మసీదులోకి పురావస్తుశాఖ సర్వే చేసింది. వారు ఇచ్చిన రిపోర్టులో మసీదు కింది పెద్ద దివ్య మందిర ఆనవాళ్లను వాళ్లు కనుగొన్నారు. హిందూ దేవుళ్ల విగ్రహాలు, ఇది హిందూ గుడి అనే చెప్పేందుకు 32 శానసాలు కూడా దొరికాయి. అందులో ఒకటి తెలుగులో ఉంది.
ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే..!
17వ శాతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ హయంలో శివాలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారని చెబుతున్నాయి. అక్కడ మొదటి నుంచి మసీదు లేదనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. హిందూ ఆనవాళ్లు దొరికాయి కదా అని ఆ స్థలం హిందూవులకు అప్పగించాలా..? లేదా 200 ఏళ్లుగా ఆ స్థలం ఒకరి ఆధీనంలో ఉంది.. ఇప్పుడు సడన్ గా వేరే వాళ్లకు ఇవ్వడం కరెక్టేనా ? అన్న సవాళ్లు కోర్టు ముందు ఉన్నాయి. అయోధ్యది కూడా ఇదే తరహా కేసు కాబట్టి.. అదే తీర్పును కోట్ చేస్తూ.. తమకు అప్పగించాల్సిందేనని హిందూ సంఘాలు వాదిస్తున్నాయి. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.