అన్వేషించండి

Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్

Ilaiyaraaja :రాజ్యసభ ఎంపీ ఇళయరాజాకు కుల వివక్షను ఎదురైంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యాయి

Ilaiyaraaja Discrimination: టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నా.. నేటి ఏఐ యుగంలోనూ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు మారలేదు. ఇప్పటికీ చాలా చోట్ల కుల వివక్ష పేరుతో చాలా మందిని చిన్నచూపు చూస్తున్నారు. ఆలయాల్లోకి రావడంపై నిషేధం విధిస్తున్నారు. వాళ్లను తాకితేనే అదేదో పెద్ద అంటరానితనంగా భావిస్తున్నారు. ఈ తరహా నియమాలు, ఆచారాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. పలు రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, దేశంలో ఎన్నో పతకాలు, అవార్డులు అందుకున్నా.. కొందరిని కుల వివక్షపేరుతో ఇప్పటికీ అవమానిస్తున్నారు.

తన సంగీత మాధుర్యంతో ప్రకృతిని సైతం పరవశింపజేసే మ్యూజికల్ మ్యాస్ట్రో, రాజ్యసభ ఎంపీ ఇళయరాజాకు సైతం కుల వివక్ష నుంచి తప్పించుకోలేకపోయారు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించకుండా ఆయన్ను అడ్డుకున్నారు. ఇళయరాజా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంగీతకారుడు అయినప్పటికీ ఈ సమస్య ఆయన్ను వెంటాడడం ఆయన అభిమానులను, మానవత్వం ఉన్న జనాలను ఎంతగానో కలచివేస్తోంది. తమిళనాడులోని తేని జిల్లాలో ఒక దళిత కుటుంబంలో 1943 జూన్ 3న జన్మించారు.

అసలు విషయం ఏమిటంటే..

ప్రముఖ సంగీత విద్వాంసుడు, రాజ్యసభ ఎంపీ ఇళయరాజాపై కుల వివక్షకు సంబంధించిన షాకింగ్ కేసు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయంలో వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారి ఆయనను గర్భగుడిలోకి (ఆలయ ప్రధాన స్థలం)లోకి రాకుండా అడ్డుకున్నాడు. అనంతరం ఇళయరాజాను అక్కడి నుంచి తోసేశారు. దీనికి సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మనం ఏ యుగంలో ఉన్నామంటూ చాలా మంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఎన్ని మారినా కొందరి మనస్తత్వాలు మారవని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అయినప్పటికీ ఇప్పటికీ దేశంలోని ప్రజలు కుల వివక్షను ఎదుర్కోవాల్సి రావడం చాలా సిగ్గుచేటని చాలా మంది భావిస్తున్నారు. 

7000కు పైగా పాటలు కంపోజ్ చేసిన ఇళయరాజా

ఇళయరాజా సంగీతానికి ఎంతో సేవ చేశారు. అదే ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. ప్రధానంగా దక్షిణ భారత భాషల్లో రూపొందిన చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఆయన 7వేలకు పైగా పాటలను స్వరపరిచారు. ఇది కాకుండా, ఇళయరాజా ఇరవై వేలకు పైగా కచేరీలలో పాల్గొన్నారు. ఇళయరాజా తన జీవితకాలంలో సెంటినరీ అవార్డుతో పాటు, ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. భారతదేశం ఆయనను 2010లో పద్మభూషణ్‌, 2018లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. 2012లో సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఇళయరాజా లండన్‌లోని ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ నుండి క్లాసికల్ గిటార్ ప్లే చేయడంలో బంగారు పతక విజేతగా కూడా నిలిచారు.  

ఇళయరాజా 3 జూన్ 1943న భారతదేశంలోని ప్రస్తుత తమిళనాడులోని తేని జిల్లాలోని పన్నైపురంలో ఒక తమిళ కుటుంబంలో జ్ఞానదేశిగన్‌గా జన్మించారు. ఆయనతో పాటు జనతా ఎం. కరుణానిధి పుట్టిన తేదీ కూడా జూన్ 3నే. ఈ కారణంగానే జూన్ 3న కరుణానిధి పుట్టిన తేదీని మాత్రమే ప్రజలు జరుపుకునేలా జూన్ 2న తన పుట్టిన తేదీని జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత ఇళయరాజాకు "ఇసైజ్ఞాని" అనే బిరుదు ఇచ్చారు.

Also Read : Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో చల్లారని వివాదం- మరోసారి పోలీస్‌స్టేషన్‌కు మనోజ్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Ilaiyaraaja : సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
సిగ్గుచేటు.. ఆలయంలో ఇళయరాజాకు ఘోర అవమానం- వీడియో వైరల్
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Embed widget