అన్వేషించండి

Assam CM About INDIA: విపక్ష కూటమి కొత్త పేరు ఇండియాపై అసోం సీఎం సెటైర్లు, భారత్ కోసం బీజేపీ అని ట్వీట్

Assam CM Himanta On INDIA: విపక్షాల కూటమికి  ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.

Assam CM Himanta On INDIA: బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విపక్షాల కూటమి సమావేశంపై విమర్శలు చేశారు. విపక్షాల కూటమి రెండో రోజు సమావేశంలో భాగంగా మంగళవారం తమ కూటమికి  ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు. దేశ సంస్కృతి, నాగరికత వైరుద్ధ్యం భారత్, ఇండియా మధ్య ఉందన్నారు. మన దేశాన్ని కలోనల్ లెగసీ నుంచి విముక్తి  కల్పించాలని అభిప్రాయపడ్డారు. 

విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అని నామకరణం చేయడాన్ని అసోం సీఎం హిమంత తప్పుపట్టారు. ఆ పేరును లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. అందులో ఏముందంటే.. మన నాగరికత వివాదం అంతా ఇండియా, భారత్ చుట్టూ నెలకొందన్నారు. మన దేశానికి బ్రిటిష్ వారు భారతదేశం అని పేరు పెట్టారు. నేడు విపక్షాల కూటమి అదే పేరు పెట్టుకోవడంతో.. వలస వారసత్వాల నుంచి విముక్తి పొందడానికి పోరాడాలని ప్రయత్నించాలి. గతంలో మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారని, ఇప్పుడు మనం సైతం భారత్ కోసం పోరాటం కొనసాగిద్దామని పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.

బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష సమావేశం రెండో రోజు  కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు తమ కూటమికి కూటమికి  I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ (INDIA)గా నామకరణం చేశారు. గతంలో ఈ కూటమి యూపీఏగా ఉండేది. ఇక నుంచి తమ కూటమి ఇండియా అని, దేశాన్ని ఎన్డీఏ నుంచి విముక్తి కల్పించడమే తమ ధ్యేయం అని ప్రకటించారు. 

మరోవైపు ఢిల్లీలో నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) సమావేశం కొనసాగుతోంది.  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సమావేశంలో 38 పార్టీలు పాల్గొన్నాయి. వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు అధికార కూటమి పార్టీల నేతలు ఢిల్లీలో కీలక భేటీలో ప్రతిపక్షాల కూటమిని ఓడించడంపై చర్చిస్తున్నారు. 1998లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య 24 ఉండగా, నేడు ఆ సంఖ్య 38కి పెరిగిందన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎన్డీఏ కూటమి విస్తరణతో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాధరణను తెలియజేస్తుందన్నారు.

ఢిల్లీలోని అశోకా హోటల్‌లో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఎన్డీఏ ఏర్పాటై 25 పూర్తయిందన్నారు మోదీ. దేశ ప్రజల ఆకాంక్షను ఎన్డీఏ నెరవేర్చిందన్నారు. ఎన్డీఏతో కలిసి వచ్చిన పార్టీలకు అభినందనలు తెలిపారు. దేశ పునర్ నిర్మాణంలో ఏన్డీఏ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana : కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
Andhra Pradesh: యాంటీ
యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్‌, నిన్న అవినాష్‌, రేపు ఎవరు?
KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
OTT Romantic Drama: థియేటర్లలో విడుదలైన మూడున్నర నెలలకు ఓటీటీలోకి - 'ఉషా పరిణయం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో విడుదలైన మూడున్నర నెలలకు ఓటీటీలోకి - 'ఉషా పరిణయం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Lankan Airlines Ramayana Ad | రామాయణంపై శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ యాడ్ | ABP DesamKhalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP DesamVikarabad Collector Prateek Jain Attacked | కలెక్టర్‌పై గ్రామస్థుల మూకుమ్మడి దాడి | ABP DesamGautam Gambhir Australia Press meet | BGT 2024 కోసం కసిగా ఎదురుచూస్తున్నామన్న గౌతం గంభీర్ |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana : కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
Andhra Pradesh: యాంటీ
యాంటీ "సోషల్"యాక్టివిటీలో ఇరుక్కుంటున్న కీలక నేతలు- మొన్న భార్గవ్‌, నిన్న అవినాష్‌, రేపు ఎవరు?
KTR vs Revanth Reddy: అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి అక్రమాలు, కేంద్రానికి కేటీఆర్ ఫిర్యాదులో సంచలన విషయాలు
OTT Romantic Drama: థియేటర్లలో విడుదలైన మూడున్నర నెలలకు ఓటీటీలోకి - 'ఉషా పరిణయం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
థియేటర్లలో విడుదలైన మూడున్నర నెలలకు ఓటీటీలోకి - 'ఉషా పరిణయం' డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Sita Mai Temple: తెలుగు రాష్ట్రాల్లో సీతమ్మకు ఒకే ఒక ఆలయం - దేశంలో ఇంకెక్కడున్నాయో తెలుసా!
తెలుగు రాష్ట్రాల్లో సీతమ్మకు ఒకే ఒక ఆలయం - దేశంలో ఇంకెక్కడున్నాయో తెలుసా!
Andhra Pradesh: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా  కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?
AP Nominated Posts: ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్,
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ఎఫెక్ట్, "ఆ నలుగురికి" అన్యాయం జరిగిందా ?
Kalki 2898 AD Japan Release Date : జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
జపాన్​లో గ్రాండ్​గా రిలీజ్ కాబోతున్న ప్రభాస్ కల్కీ 2898 AD.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే 
Embed widget