Viral News: గడ్డం మాకు అడ్డం అంటున్న అమ్మాయిలు! క్లీన్ షేవ్ కావాలంటూ ఏకంగా ప్రదర్శన
No Beard Boyfriends | అబ్బాయిలను ఎంచుకోవడంలో అమ్మాయిల ఫ్రిఫరెన్సులు మారిపోతున్నాయి. తమకు ఏం కావాలో అది కచ్చితంగా చెబుతున్నారు. ఇండోర్‌లో అమ్మాయిలైతే రోడ్డుమీదకొచ్చి మరీ చెబుతున్నారు.

No beard No Love: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కొంతమంది అమ్మాయిలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శన చేశారు. అయితే ఇది అలాంటి ఇలాంటి ప్రదర్శన కాదు. కొంచం కొత్తగానే ఉంది. చాలా మంది అమ్మాయిలు కొన్ని ఫేక్ గడ్డాలు పెట్టుకుని ప్లకార్డులు చేతుల్లో పట్టుకుని వచ్చారు. మాకు గడ్డాలున్న అబ్బాయిలొద్దు... క్లీన్ షేవ్ ఉన్న అబ్బాయిలే కావాలన్నది వాళ్ల ఉద్దేశ్యం. మామూలుగా ఏ సంఘటనకు అయినా మద్దతుగానో.. లేదా వ్యతిరేకంగానో ప్రదర్శనలు జరుగుతుండటం కామన్. కానీ ఇండోర్‌లో జరిగిన ఈ ప్రదర్శన మాత్రం కొంచం కొత్తగానే ఉంది. అక్కడ అమ్మాయిలు నయా ట్రెండ్‌ను క్రియేట్ చేశారు అనుకోవాలి. ఇన్‌స్టా, ట్విటర్‌లో బాగా షేర్ అవుతున్న ఈ వీడియోపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
గడ్డం కావాలా గర్ల్ ఫ్రెండ్ కావాలా...?
అబ్బాయిలును చూజ్ చేసుకోవడంలో అమ్మాయిలు ప్రిఫెరెన్సులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. వాళ్లకి ఏం కావాలో వాళ్లు క్లియర్‌గా చెప్పేస్తున్నారు. చదువు సంధ్యలే కాదు బాడీ, లుక్స్‌కు కూడా ఇప్పుడు ప్రాధాన్యత పెరిగిపోయింది. అలాంటిదే ఈ అమ్మాయిల గొడవ కూడా. వీళ్లకు గడ్డంతో ఉన్న అబ్బాయింటే మహా చిరాకు అంట.. అందుకే ఆ విషయాన్ని చెబుతూ ఏకంగా ర్యాలీనే చేసేశారు.
మోడరన్‌గా కనిపిస్తున్న కొంతమంది అమ్మాయిలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. దాదాపు అందరూ గెడ్డం విగ్గులు పెట్టుకుని వచ్చారు. వాళ్లు తీసుకొచ్చిన ప్లకార్డుల మీద కూడా పలు నినాదాలు ఉన్నాయి. గడ్డాన్ని అయినా మర్చిపో.. లేదా గర్ల్ ఫ్రెండ్‌ను అయినా మర్చిపో (Beard hatao, ya Girlfriend bhul jao) No clean Shave No love వంటివి రాసుకొచ్చి నినాదాలు కూడా చేశారు.
అయినా ఈ అమ్మాయిలకు గడ్డంతో ప్రాబ్లమ్ ఏంటో అర్థం కాలేదు. ఇండియాలో గడ్డం ఇప్పటిది కాదు కదా.. పురుషులందు పురాణ పురుషులు వేరయా అని పాత కాలంలో మగాళ్లంతా గడ్డాలతోనే ఉండేవారు. ఆ తర్వాత నేటి మోడరన్ యుగంలో కూడా లైట్‌గా గడ్డం పెంచడాన్ని మాన్లినెస్‌కు చిహ్నంగా భావిస్తుంటాం. ఇప్పటి మూవీ హీరోలైతే ఎక్కువుగా పుల్ బియర్డ్‌లోనే కనిపిస్తున్నారు. అంతెందుకు అమ్మాయిలు గడ్డం ఉన్న అబ్బాయిలనే కోరుకుంటారని... “ఫన్నీగా కనిపించేలా నున్నుంగా షేవింగేలా కొంచం రఫ్ మాన్లినెస్ ఉండాలి” అని త్రివిక్రమ్ పాటల్లో కూడా అనిపించాడు. ఇప్పుటి వరకూ అయితే అమ్మాయిలు గడ్డం ఉన్న అబ్బాయిలనే ఇష్టపడతారు అనే అభిప్రాయం ఉంది. కానీ ఈ అమ్మాయిలు మాత్రం మాకు క్లీన్ షేవే కావాలంటున్నారు.
View this post on Instagram
అయితే అసలు ఈ ప్రదర్శన ఎవరు చేశారు. నిజంగా అమ్మాయిలు అదే ఉద్దేశ్యంతో చేశారా లేక ఏదైనా ప్రొడక్టుకు సంబంధించిన పబ్లిసిటీ స్టంటా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఇది బాగా వైరల్ అయితే దీనిని బేస్ చేసుకుని ప్రొడక్టును తీసుకొస్తారేమో కూడా తెలీదు. ఇంటర్నెట్‌లో వచ్చిన ఈ వీడియోపై మిక్సిడ్ కామెంట్లు వస్తున్నాయి. అంతగా గడ్డం ఉన్న అబ్బాయిలు ఇష్టం లేకపోతే క్లీన్ షేవ్ ఉన్న వాళ్లని ట్రై చేసుకోండి... అని ఒకరు స్పందించగా రీల్స్ వైరల్ చేసుకోవడానికి ఇదో స్టంట్ అంటూ మరొకరు అన్నారు. Indore Girls be in dore అంటూ సెటైర్ కూడా వేశారు. దేశంలో ఇంతకన్నా సమస్యలు లేవా అంటూ ఓ వ్యక్తి చీత్కరించారు. మొత్తానికి ఈ వీడియో అయితే బాగా వైరల్ అవుతోంది. మామూలుగా విదేశాల్లో ఈ తరహా.. లైటర్ విషయాలపై ప్రదర్శనలు ఎక్కువుగా జరుగుతుంటాయి. ఇండియాలో ఇలాంటివి తక్కువ. ఈ విషయంలో ఇండోర్ అమ్మాయిలు ఓ అడుగు ముందుకేసినట్లే
అయినా అందరికీ క్లీన్ షేవ్ మహేష్ బాబులే కావాలంటే.. గడ్డం పెంచుకునే మగాళ్లు ఏం కావాలి..?
Also Read: Viral News : మరి పెళ్లంటే అన్నీ చూసుకోవాలి బ్రో - వధువు కోసం ఓ మగాడిచ్చిన ప్రకటన వైరల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

