Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Delhi Farmers Protest: తమ డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈనెల 6 నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని రైతు నాయకులు తెలిపారు.
Farmers to walk from 9 am to 5 pm daily as Delhi Chalo march | న్యూఢిల్లీ: రైతులు చేపట్టబోయే ఢిల్లీ ఛలో యాత్రకు సంబంధించి కార్యచరణ ఖరారైంది. కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్) రెండు సంస్తలు కలిసి ఈనెల 6 నుంచి ఢిల్లీకి జరపబోయే పాదయాత్ర రూట్ మ్యాప్ ను రూపొందించాయి. 235 కిలోమీటర్ల ఈ పాదయాత్ర.. పంజాబ్ లోని పాటియాల జిల్లా, రాజపూరా నియోజకవర్గంలోని శంభూ సరిహద్దు నుంచి ప్రారంభమవుతుందని నేతలు పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయత్రం 5 గంటలు నడక ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్రం, హార్యాన ప్రభుత్వాలు సహకరించాలి..
రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేసుకోవచ్చని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్లు, హర్యానా వ్యవసాయ మంత్రి ప్రకటించినట్లు కేఎంఎం సంస్థ కో ఆర్డినేటర్ సర్వాన్ సింగ్ పంధర్ తెలిపారు. ఇప్పటికైనా హర్యానా, కేంద్రం తము రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. శంభూ నుంచి ఈనెల 6 మధ్యాహ్నం యాత్ర ప్రారంభమవుతుందని, ఆ తర్వాత రోజు నుంచి ఉదయం 9 గంటలకే యాత్ర కొనసాగిస్తామని పేర్కొన్నారు. యాత్ర తొలిదశలో భాగంగా సత్నాం సింగ్ పన్ను, స్విందర్ సింగ్ చాతాలా, సూర్జిత్ సింగ్ ఫూల్, బల్జిందర్ సింగ్ చందీవాలా తదితర రైతు నాయకులు పాల్గొంటారని వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించి వసతి, భోజన సౌకర్యాన్ని హర్యానా ప్రజలు చేకూరుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి నుంచి దర్నా..
కేఎంఎం, ఎస్కేఎం రైతు నాయకులు, కార్యకర్తలు శంభూ, ఖానూరి సరిహద్దుల్లో ఈ ఫిబ్రవరి 13 నుంచి దర్నా చేస్తున్నారు. సోమవారానాకి ఈ దర్న 294వ రోజుకు చేరుకుంది. రైతులకు కనీస మద్ధతు ధరతోపాటు మరో 12 హామీలపై గ్యారెంటీలను డిమాండ్ చేస్తూ రైతులు ఈ దర్నా చేస్తున్నారు. ఇక శంభూ నుంచి ప్రారంభమయ్యే యాత్ర అంబాలలోని జగ్గీ సిటీ సెంటర్ లో విశ్రాంతి తీసుకుంటుందని, ఆ తర్వాత రోజు అంబాలలోని మోర్చా వరకు యాత్ర జరుగుతుందని రైతు నాయకులు తెలిపారు. ఆ తర్వాత ఖాన్పూర్ జట్టా, పిప్లీ మీదుగా యాత్ర సాగుతుందని తెలిపారు.
యాత్రతో ప్రజలకు ఇబ్బందులుండొద్దు: సుప్రీం
మరోవైపు రైతుల చేస్తున్న ఈ యాత్ర వల్ల సామన్యులకు ఇబ్బందులు గురి కాకుండా చూడాలని సుప్రీంకోర్టు సూచించింది. యాత్ర జరుగుతున్న ఖన్నూరి సరిహద్దు పంజాబ్ కు కీలకమైన ప్రదేశమని, ఈ యాత్ర జరపడం వల్ల ప్రజలు ఎలాంటి అసౌకర్యానిక గురి కాకుండా చూడాలని ఆదేశించింది. ఆ యాత్ర కరెక్టో, కాదో దాని ఉద్దేశాల గురించి తాము వ్యాఖ్యానించడం లేదని, సామన్యుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలిస్తున్నట్లు జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది.
మరోవైపు ఈ యాత్ర కోసం కేంద్రం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. మూడెంచెల భద్రతతో సుమారు 5వేల మంది పోలీసులను మోహరించింది. ఇప్పటికే రైతు నాయకులతో చర్చలు జరుపుతున్న పోలీసు అధికారులు పేర్కొన్నారు.
Also Read: Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం