Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం
Maharastra New CM: ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉత్కంఠ వీడింది. కొత్త సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Devendra Fadnavis As New CM Of Maharastra: మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉత్కంఠ వీడింది. ఆ రాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ (Devendra Fadnavis) పేరును బీజేపీ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నెల 2 లేదా 3న ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో ఫడణవీస్‌ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని ఆ పార్టీ సీనియర్ నేత ఆదివారం రాత్రి వెల్లడించారు. కాగా, సీఎం ఎంపిక విషయంలో మహాయుతిలో గత కొద్ది రోజులుగా ప్రతిష్టంభన నెలకొన్న విషయం తెలిసిందే. ముందు నుంచీ మహారాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న ఫడ్నవీస్ పేరే సీఎం రేసులో ప్రముఖంగా వినిపించింది. ఎట్టకేలకు ఫడణవీస్‌ను సీఎంగా నిర్ణయించిన బీజేపీ సోమవారం దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
అటు, మహాయుతి కూటమిలో కీలకంగా వ్యవహరించిన ఏక్‌నాథ్ షిండే (శివసేన) సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే, దీనిపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని.. బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిసి ఏకాభిప్రాయానికి రానున్నట్లు షిండే తెలిపారు. అమిత్ షాతో భేటీ అనంతరం షిండే మెత్తబడినట్లు తెలుస్తోంది. అయితే, కీలక మంత్రిత్వ శాఖలను ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 5 మధ్యాహ్నం 1 గంటకు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిర్వహించనున్నారు.
Also Read: Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ