Gautam Adani: ఎన్ని దాడులు జరిగితే అంత రాటుదేలతాం - ఆరోపణలపై తొలిసారి స్పందించిన అదానీ
అదానీ గ్రూపుపై గతేడాది జనవరిలో హిండెన్ బర్గ్ రీసెర్చీ ఆరోపణలు చేయగా, ఈ ఏడాది అమెరికా కోర్టులో అధికారులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపైగ్రూపు చైర్మన్ అదానీ స్పందించారు.
Gautam Adani breaks silence on bribery charges in America | జైపూర్: తన వ్యాపారాలపై వచ్చిన ఆరోపణలపై భారత కుబేరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ స్పందించారు. తమపై జరుగుతున్న దాడుల వల్ల తామింక మరింత పటిష్టమవుతున్నట్లు పేర్కొన్నారు. రాజస్థాన్ లో జరిగిన 51వ అవార్డుల ప్రదానోత్సవంలో తాజాగా పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు
రెండు వారాల కిందట అమెరికాలో తమ కంపెనీకి చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీపై అరోపణలు వచ్చాయని, ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదని అదానీ గుర్తు చేశారు. ఇలాంటి ఆరోపణలు ఎదురైన ప్రతీసారి తమ మరింతగా రాటుదేలుతామని, ఎదురయ్యే ప్రతి సవాళ్లను విజయ సోపానాలుగా మార్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గతనెల 20న భారత అధికారులకు అదానీ గ్రూపు దాాపు 25 కోట్ల డాలర్లను ముడుపులుగా చెల్లించిందని అమెరికా ప్రాసిక్యూటర్లు అరోపించిన సంగతితెలిసిందే. ఈ లంచాల ద్వారా సోలార్ పవర్ కు సంబంధించిన ప్రాజెక్టును అదానీ గ్రీన్ ఎనర్జీ సాధించిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను నిరాధారమైనవని అదానీ గ్రూపు కొట్టేసిన సంగతి తెలిసిందే.
కోర్టు పరిధిలో ఉంది.
మరోవైపు అదానీ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ప్రైవేటు కంపెనీలు, కొంతమంది వ్యక్తులు, అెమెరికన్ న్యాయ శాఖకు సంబంధించిన వ్యవహారమని శుక్రవారం విదేశాంక శాఖాధికారులు పేర్కొన్నారు. చట్టప్రకారం ఈ వ్యవహారం ముందుకు సాగుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
హిండెన్ బర్గ్ రీసెర్ఛ్ పైనా..
మరోవైపు గతేదాడి తమ గ్రూపును కుదిపేసిన హిండెన్ బర్గ్ రీసెర్ఛ్ నివేదికపైనా అదానీ స్పందించారు. ఈ ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, తమ కంపెనీ ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు, రాజకీయ ప్రకంపనలు రేకెత్తించాలనే ధ్యేయంతో జరిగినట్లు పేర్కొన్నారు. నిజానికి గత జనవరిలో తాము ఫాలోఆన్ పబ్లిక్ ఆఫరింగ్ కు సిద్ధమయ్యామని, ఈ దశలొ ఉద్దేశపూర్వకంగా దాడులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి షార్ట్ సెల్లింగ్ ద్వారా దాడులకు గురయ్యామని పేర్కొన్నారు. దురద్దేశాలతోనే ఆ కంపెనీ తమపై ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించారు.
ఏదేమైనప్పటికీ, హిండెన్ బర్గ్ ఆరోపణలద్వార తమ కంపెనీ ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. ఇలాంటి ఆరోపణలు ఎదురైనప్పటికీ తాము మరింత స్ట్రాంగ్ గా పనిచేశామని, ఎఫ్ పీఓ ద్వారా20 వేల కోట్ల రూపాయల నిధులు సేకరించి ఇండియాలోనే అత్యంత భారీ ఎప్ పీఓ గా నిలిచామని పేర్కొన్నారు.
నిధులను సేకరిస్తున్నాం..
అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులను సేకరిస్తున్నామని, తద్వార అప్పులను తగ్గిస్తున్నామని అదానీ పేర్కొన్నారు. దీంతో తమ సంస్థల Debt to EBITDA రేషియో 2.5 రెట్ల దిగువకు వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తమకు ఇండియాలోనే కాకుండా, విదేశాలకు చెందిన ఏ క్రెడిట్ రేటింగ్ సంస్థ తమను తక్కువ రేటింగ్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మరోవైపు భారత సుప్రీంకోర్టు నుంచి కూడా తమకు అనుకూల తీర్పు వచ్చిందని గుర్తు చేశారు.