అన్వేషించండి

Covid-19 in China: 'అంతా ఉత్తుత్తిదే'- కరోనా కేసుల వార్తలపై చైనా బుకాయింపు!

Covid-19 in China: తమ దేశంలో కొవిడ్ పరిస్థితులపై వస్తోన్న వార్తలను చైనా ఖండించింది.

Covid-19 in China: కరోనా వైరస్‌తో చైనా పరిస్థితి ఎలా ఉందో ప్రపంచ దేశాలన్నీ గమనిస్తున్నాయి. శ్మశానాల వద్ద క్యూలైన్లు, మెడిసిన్స్ కొరత, ఆసుపత్రులు హౌస్‌ఫుల్ అంటూ చైనాలో కరోనా పరిస్థితులపై రోజూ కథనాలు వస్తాయి. ఎప్పటిలానే ఈ వార్తలను చైనా తోసిపుచ్చింది. ఇవన్నీ వక్రీకరించిన కథనాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

" కరోనా ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకే మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజలను కాపాడేందుకు అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాం. దశలవారీగా వైరస్ విజృంభిస్తోంది. దానిని ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమయానుకూలంగా శాస్త్రీయ పద్ధతులను చైనా అనుసరిస్తోంది.                     "
-    చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి  

నో ఆంక్షలు

కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ జీరో కొవిడ్ విధానం నుంచి చైనా క్రమంగా దూరంగా జరుగుతోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే ప్రయాణికులకు వచ్చే నెల 8వ తేదీ నుంచి క్వారంటైన్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రకటించింది. అంతేకాకుండా కొవిడ్ స్థాయిని క్లాస్ 'ఎ' ఇన్‌ఫెక్షన్ల నుంచి క్లాస్ 'బి' కి తగ్గిస్తున్నట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్  ప్రకటించింది.

తద్వారా కొవిడ్ రోగులు, వారితో సన్నిహితంగా మెలిగిన వారికి తప్పనిసరి క్వారంటైన్ సహా కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో లాక్ డౌన్ అవసరం లేకుండా పోయింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో చైనీయులు విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని వల్ల ఇతర దేశాలకు కూడా చైనాలో ఉన్న కొత్త వేరియంట్లు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నో మెడిసిన్స్

కరోనా విజృంభణ కారణంగా చైనాలో ఔషధాల సరఫరా తీవ్రంగా దెబ్బతింది. దీంతో బ్లాక్ మార్కెట్‌ దందా మొదలైంది. జనరిక్ కొవిడ్-19 ఔషధాలు ఫార్మసీలో దొరకకపోయేసరికి ప్రజలు బ్లాక్ మార్కెటింగ్‌ను ఆశ్రయిస్తున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) నివేదిక ప్రకారం, దేశంలో ఆమోదించిన కొవిడ్-19 యాంటీ వైరల్‌ మెడిసిన్ సరఫరా పరిమితంగా ఉంది. అందులోనూ వాటి ధరలు ఆకాశ్నంటాయి. దీంతో ప్రజలు.. భారత్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న జనరిక్ మందుల వైపు పరుగులు పెడుతున్నారు. 

భారత్ నుంచి నాలుగు రకాల జనరిక్ యాంటీ కొవిడ్ మందులు.. చైనా మార్కెట్‌లో చట్టవిరుద్ధంగా అమ్ముడవుతున్నాయి. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్ బ్రాండ్ పేర్లతో వీటిని బ్లాక్‌ మార్కెట్ దందా చేస్తోంది. 

చైనా ఈ సంవత్సరం రెండు కొవిడ్-19 యాంటీ వైరల్‌లను ఆమోదించింది. ఫైజర్స్ కంపెనీకి చెందిన పాక్స్‌లోవిడ్, చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్ నుంచి వచ్చి HIV ఔషధం అజ్వుడిన్‌ను చైనా ఆమోదించింది. కానీ ఈ రెండు మందులు కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 113 సార్లు సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించారు: CRPF

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
CM Chandrababu:సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
సెమీకండక్టర్‌ రంగంలో ఏపీకి కేంద్రం భరోసా, రూ.10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌
ABP Desam Top 10, 25 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 25 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
BRS Leaders Kannepalli Visit: కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలి.. లేకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
November Weather 2026: నవంబర్ 2026 వాతావరణం! భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
నవంబర్ 2026 వాతావరణం: భారీ వర్షాలు, తీవ్ర చలి.. కీలక తేదీలు ఇవే!
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
Embed widget