(Source: ECI/ABP News/ABP Majha)
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 113 సార్లు సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించారు: CRPF
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పలు మార్లు సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించినట్లు సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గురువారం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ చేసిన భద్రతా లోపాల ఆరోపణలను CRPF తోసిపుచ్చింది.
దిల్లీలో 'భారత్ జోడో యాత్ర' సందర్భంగా "భద్రతా ఉల్లంఘనలు" జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ గాంధీ సహా యాత్రలో పాల్గొనే వారికి తగిన భద్రతను కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ బుధవారం లేఖ రాసింది. ఈ లేఖకు ప్రతిస్పందనగా సీఆర్‌పీఎఫ్ వివరణ ఇచ్చింది.
Security arrangements have been fully made for Rahul Gandhi. It may be pointed out that during visits of the protectee the required security arrangements are made by the CRPF in coordination with state police & security agencies: CRPF
— ANI (@ANI) December 29, 2022
113 సార్లు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ 2020 నుంచి ఇప్పటివరకు 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని సీఆర్‌పీఎఫ్ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆయనకు తెలియజేశారని పేర్కొంది.
Since 2020, there have been 113 violations observed and duly communicated. It may further be mentioned that during Delhi leg of Bharat Jodo Yatra, the protectee has violated security guidelines and CRPF will be taking up this matter separately: CRPF
— ANI (@ANI) December 29, 2022
Also Read: Lokayukta Bill: లోకాయుక్త బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర