By: ABP Desam | Updated at : 29 Dec 2022 11:01 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Getty)
Lokayukta Bill: మహారాష్ట్ర అసెంబ్లీ లోకాయుక్త బిల్లు 2022ను బుధవారం ఆమోదించింది.ఈ బిల్లుతో ముఖ్యమంత్రి, మంత్రివర్గం అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్ పరిధిలోకి రానున్నారు. టీచర్స్ ఎంట్రన్స్ టెస్ట్‌లో జరిగిన స్కాం విషయం గురించి విపక్షాలు సభను బహిష్కరించడంతో ఎలాంటి చర్చ లేకుండా ఈ బిల్లును ఆమోదించారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. ఇది చారిత్రక బిల్లుగా అభివర్ణించారు. ఇలాంటి చట్టం ఉన్న ఏకైక రాష్ట్రం మహారాష్ట్రనే అని అయన తెలిపారు.
ఇదీ సంగతి
ఈ బిల్లు ప్రకారం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా విచారణ ప్రారంభించే ముందు అసెంబ్లీలో ఆమోదం పొందాలి. వెంటనే సభా సమావేశాల ముందు మోషన్ దాఖలు చేయాలి. ఈ మోషన్ సభలో రెండొంతుల మంది సభ్యుల ఆమోదం పొందాలి. ముఖ్యమంత్రికి సంబంధించి వచ్చే అవినీతి ఆరోపణలలో రాష్ట్ర భద్రత, జన జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటే లోకాయుక్త వాటిని విచారించరాదు. ఒక వేళ ఏదైనా విచారణ చేపట్టి.. దానిని నిలిపివేయ్యాలి అని లోకాయుక్త భావిస్తే.. ఇందుకు సంబంధించిన వివరాలను ఎక్కడా ప్రచురించరాదు, ఎవరికీ అందుబాటులో ఉంచరాదు.
నియామకం
అంబుడ్స్‌మన్ నియామకంపై కూడా ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన, చేస్తోన్న లేదా బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసినవారు లోకాయుక్త ఛైర్‌పర్సన్ ఉంటారు. నలుగురు సభ్యుల్లో ఇద్దరు న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు ఉండాలని బిల్లు తెలిపింది.
లోకాయుక్త సభ్యులను, ఛైర్‌పర్సన్‌ను ఎంపిక చేసే కమిటిలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతలు, చీఫ్ జస్టిస్ ఆఫ్ బాంబే హై కోర్టు లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ నామినేట్ చేసిన న్యాయమూర్తి ఈ కమిటిలో ఉంటారు అని బిల్లులో పేర్కొన్నారు. కమిటీలో సభ్యలు తక్కువగా ఉన్నారని ఛైర్‌పర్సన్ లేదా ఇతర సభ్యులు ఎవరినైనా నియమిస్తే ఆ నియామకం చెల్లదు అని బిల్లు స్పష్టం చేసింది.
Also Read: NIA Raids: కేరళలోని 56 ప్రదేశాల్లో NIA దాడులు- అల్‌ఖైదాతో టచ్‌లో పీఎఫ్ఐ!
Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
Nizamabad News : కలెక్టరేట్ ముందు సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం, బిల్లులు చెల్లించకుండా ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపణలు!
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
Congress: రిజర్వేషన్ విషయంలో కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కై ఎస్సీ,ఎస్టీ, బీసీలను మోసం చేశాయి !
Bandi Sanjay : గవర్నర్ విషయంలో హైకోర్టు చివాట్లు, కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్?- బండి సంజయ్
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
Thalapathy67: అందరికీ తెలిసిందే - అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్!
BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!
Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?