అన్వేషించండి

Vettaiyan Movie Review - 'వేట్టయన్' రివ్యూ: మాసీగా తీసిన క్లాస్ మెసేజ్ - వేటగాడు గురి పెడితే ... రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే?

Vettaiyan Review In Telugu: ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా సూపర్ స్టార్ నటించిన 'వేట్టయన్' సినిమా ఎలా ఉంది? రజనీతో 'జై భీమ్' దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఎటువంటి సినిమా తీశారు? అనేది రివ్యూలో చూడండి.

Rajinikanth's Vettaiyan The Hunter Movie Review In Telugu: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్'. లైకా ప్రొడక్షన్స్ అధినేత సుబాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ప్రధాన పాత్రధారులు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది. మరి, ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి.

కథ (Vettaiyan Story): అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారి ఎస్పీ. ఆయన ఒక డేరింగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లను అసలు క్షమించడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత శరణ్యకు ప్రశంసలు రావడంతో పాటు ఆమె కోరుకున్నట్టు చెన్నైకు ట్రాన్స్ఫర్ అవుతుంది.

చెన్నైలో శరణ్యపై హత్యాచారం జరుగుతుంది. ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేయగా తప్పించుకుంటాడు. టీచర్స్ సంఘాలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎన్కౌంటర్ చేయడం కోసం అదియన్ సాయం తీసుకుంటారు. ఆయన 48 గంటల్లో శరణ్యను రేప్ అండ్ మర్డర్ చేసింది ఇతడే అంటూ గుణ అనే యువకుడిని ఎన్కౌంటర్ చేస్తాడు. దాని మీద న్యాయమూర్తి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

అదియన్ జీవితంలో, శరణ్య రేప్ అండ్ మర్డర్ కేసులో బ్యాటరీ అలియాస్ ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) తదితరుల పాత్రలు ఏమిటి? చివరకు ఏమని తేలింది? అనేది సినిమా. 

విశ్లేషణ (Vettaiyan Review Telugu): కమర్షియాలిటీతో కూడిన సందేశాత్మక కథలు - సినిమాలు అరుదుగా వస్తాయి. మెసేజ్ ఓరియెంటెడ్ కథల్లో మాస్ మూమెంట్స్ సెట్ అవ్వడం కష్టమనే అభిప్రాయం అటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో ఉంది. రైటింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తే కొన్ని అయినా వస్తాయని అప్పుడప్పుడూ కొన్ని సినిమాలు చెబుతాయి. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్... 'వేట్టయన్'.

మాస్... రజనీకాంత్ అంటే మాస్! 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన టీజే జ్ఞానవేల్ సూపర్ స్టార్ హీరోగా ఎటువంటి సినిమా తీస్తున్నారని 'వేట్టయన్' అనౌన్స్ చేసిన తర్వాత తెలుగు ఆడియన్స్ కూడా అనుకున్నారు. ట్రైలర్ వచ్చాక రొటీన్ పోలీస్ స్టోరీ అనిపించింది. అయితే థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్ని జ్ఞానవేల్ సర్‌ప్రైజ్ చేయడం గ్యారంటీ. ఎన్కౌంటర్ క్యారెక్టర్ రొటీన్ కావచ్చు. కానీ, అది బేస్ చేసుకుని జ్ఞానవేల్ చెప్పిన కథలో మాత్రం మంచి సందేశం ఉంది. అలాగని, క్లాస్ పీకలేదు.

రజనీకాంత్ నుంచి ఫ్యాన్స్, ఆడియన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్ ఇస్తూ... తాను చెప్పాలనుకున్న కథను చక్కగా చెప్పారు జ్ఞానవేల్. ఈ కథలో రేప్ అండ్ మర్డర్ కేస్ మెయిన్ పాయింట్ కాదు... ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మరీ ముఖ్యంగా స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నారు? విద్య పేరుతో తాము చేస్తున్న వ్యాపారానికి ఎవరైనా అడ్డొస్తే ఏం చేస్తున్నారు? అనేది మెయిన్ పాయింట్. ఆ సందేశం చెప్పడానికి, అక్కడి వరకు రావడానికి ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ చేస్తూ జ్ఞానవేల్ కథను చెప్పిన తీరు బాగుంది.

రజనీకాంత్ నుంచి ఫ్యాన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్ మొదటి అర గంటలో టీజే జ్ఞానవేల్ ఇచ్చారు. రజనీకాంత్ ఇంట్రడక్షన్, మంజూ వారియర్‌తో సాంగ్, తర్వాత గంజాయి మాఫియాపై ఎన్కౌంటర్... కమర్షియల్ ఫార్మటులో ఉన్నాయ్. శరణ్య (దుషారా విజయన్) రేప్ కేసు తర్వాతే అసలు కథలో అడుగు పెట్టారు. అప్పటి వరకు సినిమా వెళ్లిన వేగానికి అసలు కథ బ్రేకులు వేసింది. కథనం నెమ్మదిగా సాగింది. కొన్ని సన్నివేశాల్లో ఏం జరుగుతుంది? అనేది ఊహించవచ్చు. కథలో సర్‌ప్రైజ్ చేసిన జ్ఞానవేల్... కథనంలో రొటీన్ ప్యాట్రన్ ఫాలో అయ్యారు. క్లైమాక్స్ ఫైట్ బావుంది. కానీ, ఎండింగ్ అంత యాప్ట్ అనిపించలేదు. అక్కడ కొన్ని సీన్లు అనవసరం అనిపించాయి.

రజనీకాంత్ సినిమాకు రీ రికార్డింగ్ ఎలా చేయాలో అనిరుద్ కంటే బాగా ఎవరికీ తెలియదు ఏమో!? సినిమా విడుదలకు ముందు పాటలు ఓ మోత మోగించాయి. ఇంట్రో సాంగులో అనిరుద్ కనిపించినప్పుడు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. రజనీ ఎలివేషన్ షాట్స్ వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు. కెమెరా వర్క్ బావుంది. ఈ కథకు కమర్షియాలిటీ తీసుకురావడంలో కెమెరా వర్క్ ఎంతో ఉంది. కెమెరా యాంగిల్స్ సర్‌ప్రైజ్ చేస్తాయి. ప్రొడక్షన్ పరంగా లైకా ప్రొడక్షన్స్ రాజీ పడలేదు. భారీ స్టార్ కాస్ట్ సెట్ చేయడమే కాదు... భారీగా సినిమా రావడంలో కృషి చేశారు. నిడివి విషయంలో కొంత కత్తెర వేయవచ్చు. మెసేజ్ ఇచ్చే సీన్లను క్రిస్పీగా చెబితే బావుండేది.

రజనీకాంత్ మాస్ మూమెంట్స్ అందరూ ఎక్స్‌పెక్ట్‌ చేసేవే. కానీ, కొన్ని సీన్లలో చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌లో నటుడిగా ఆయన అదరగొట్టారు. ఆయన ఇచ్చిన వాన్నాఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. రజనీకాంత్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు మరొక ఆర్టిస్ట్ మీదకు చూపు వెళ్లడం కష్టం. కానీ... అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్ తామేం తక్కువ కాదన్నట్టు నటించారు.

Also Read: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్


అమితాబ్ బచ్చన్ రూపం, ఆయన నటన సత్యదేవ్ పాత్రకు హుందాతనం తీసుకు వచ్చింది. రజనీతో పాటు ఫహాద్ ఫాజిల్ చేసిన సీన్లు అయితే నవ్వించాయి. ఇద్దరి మధ్య కామెడీ టైమింగ్ భలే కుదిరింది. కానీ, ఫహాద్ ఇమేజ్ చూస్తే... ఈ క్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది. బహుశా... రజనీకాంత్ కోసం చేశారేమో!? మంజూ వారియర్ క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ. కానీ, పాటలో తన స్టెప్పులతో అదరగొట్టారు. సెకండాఫ్‌లో ఒక సన్నివేశంలో అయితే షీరోయిజం చూపించారు. 'పెళ్ళాం మొగుడు మాట వింటుందా?' అని రజనీ చెప్పే మాట విజిల్స్ వేయిస్తుంది. వైట్ కాలర్ క్రిమినల్ విలనిజం ఎలా ఉంటుందో తన ఎక్స్‌ప్రెషన్స్‌తో రానా దగ్గుబాటి చూపించారు. రజనీకి ధీటుగా నిలబడ్డారు. రావు రమేష్, రోహిణి, సంపత్ రాజ్, కృష్ణుడు... తెలుగు నటులు సినిమాలో కనిపించారు. మంచి క్యారెక్టర్లు చేశారు. దుషారా విజయన్ క్యారెక్టర్ ఆ పాత్రకు అవసరమైన ఇంపాక్ట్ తెచ్చింది. రితికా సింగ్, 'కన్నడ' కిశోర్ క్యారెక్టర్లు ఓకే.

కమర్షియాలిటీతో పాటు కథ కూడా ఉన్న సినిమా 'వేట్టయన్'. ఇందులో రజనీకాంత్ అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైమ్... మంచి మెసేజ్, కంటెంట్ ఉన్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో 'గురి పెడితే ఎర పడాల్సిందే' అని రజనీకాంత్ ఓ డైలాగ్ చెబుతారు. ఆ స్టైల్‌లో చెప్పాలంటే... వేటగాడు 'వేట్టయన్' గురి పెడితే బాక్సాఫీస్ రికార్డ్స్ సలామ్ చేయాల్సిందే. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి ఇచ్చిన మెసేజ్ అందర్నీ ఆలోచింపజేసేలా ఉంది.

Also Read: 'వేట్టయన్' ట్విట్టర్ రివ్యూ: సెకండాఫ్ హైలైట్... డామినేట్ చేసిన రజనీకాంత్ - ఆ ట్విస్ట్ కోసం చూడాల్సిందేనా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata: రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
రతనా టాటా పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ నివాళి
KTR: మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా - క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్
Andhra BJP : ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
ఇద్దరు గుంటూరు బీజేపీ నేతల నీలి పనులు - రేపోమాపో పార్టీ నుంచి సస్పెండ్ ?
Rafael Nadal Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
రిటైర్మెంట్ ప్రకటించిన స్పెయిన్ బుల్ - టెన్నిస్‌లో ముగిసిన ఒక శకం
Hyderabad: తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణలో సద్దుల బతుకమ్మ సంబరాలు - ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Milton update: హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
హుదూద్‌ కంటే వంద రెట్ల విధ్వంసం సృష్టించిన మిల్టన్ - ఫ్లోరిడా పరిస్థితి ఎలా ఉందో చూశారా ?
Ratan Tata: భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
భారత ఆటోమార్కెట్‌కు ఎంతో చేసిన రతన్ టాటా - ఈ ఐదు ఘనతలు హైలెట్!
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Embed widget