అన్వేషించండి

Trivikram: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్

Jigra Pre Release Event Hyderabad: ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన 'జిగ్రా' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. త్రివిక్రమ్, సమంత ముఖ్య అతిథులుగా వచ్చారు. గురూజీ ఏం మాట్లాడారంటే...

Trivikram speech at Jigra Telugu Pre Release Event: తనకు ఇష్టమైన హీరోయిన్లలో ఒకరు ఆలియా భట్, మరొకరు సమంత అని... వాళ్ళిద్దరూ ఇవాళ ఇక్కడ ఉండడం, వారితో గంట సేపు సరదాగా సంభాషించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. 

విజయ దశమికి తెలుగులోనూ 'జిగ్రా' విడుదల
విజయ దశమికి థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలలో 'జిగ్రా' (Jigra Movie) ఒకటి. ఆలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో రూపొందిన ఆ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ అక్టోబర్ 11న (ఈ శుక్రవారం) విడుదల అవుతోంది. ఈ చిత్రాన్ని సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా రానా దగ్గుబాటి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. త్రివిక్రమ్, సమంత ముఖ్య అతిథులుగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.

ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలనిపించింది!
''పోస్టర్ లేదా ట్రైలర్ చూసిన తర్వాత కొన్ని సినిమాలు మమ్మల్ని చూడండి అని పిలుస్తాయి. జిగ్రా ట్రైలర్ యూట్యూబ్ లో చూసిన తర్వాత నాకు సినిమా చూడాలని అనిపించింది'' అని త్రివిక్రమ్ అన్నారు. ఈ సినిమా కోసం ఆలియా భట్ ఫిజికల్ గా కూడా ఎంత కష్టపడి ఉంటారో అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుందని ఆయన అన్నారు. ''ట్రైలర్ చూసిన వెంటనే సూపర్ హిట్ అని కొన్ని సినిమాలు గురించి మనం చెబుతాం కదా! ఈ సినిమా కూడా అంతే. ట్రైలర్ చూశాక సూపర్ హిట్ అనిపించింది'' అని త్రివిక్రమ్ అన్నారు. 'జిగ్రా' దర్శకుడు వాసన్ బాలా తన పెద్ద కుమారుడికి ఇష్టమైన దర్శకుడు అని త్రివిక్రమ్ తెలిపారు. ఆయన తీసిన సినిమా ఒకటి చూశానని, ఎటువంటి భయాలు లేకుండా చాలా ధైర్యంగా సినిమా తీసే దర్శకులలో ఆయన ఒకరు అని గురూజీ చెప్పారు. 

బన్నీ గారు అప్పట్లో సమంతకు పెద్ద ఫ్యాన్!
సమంతతో తాను మూడు చిత్రాలకు పని చేశానని... తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషలలోనూ ఒకే విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లు తనకు తెలిసి రజనీకాంత్ గారు, అలాగే సమంత గారు అని త్రివిక్రమ్ చెప్పారు. 'ఏం మాయ చేసావే' సినిమా విడుదలైన తర్వాత పని తనకు ఫోన్ చేసి 'సమంత అని ఒక కొత్త హీరోయిన్ వచ్చింది. మీరు వెళ్లి సినిమా చూడండి' అని చెప్పారని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. సమంతకు అప్పట్లో బన్నీ పెద్ద ఫ్యాన్ అని తెలిపారు.

Also Read: ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?


సమంత హైదరాబాదు రావడానికి దారేది అని ట్రెండ్ చేద్దాం!
ఇప్పుడు సమంత ముంబైలో ఎక్కువ ఉంటున్నారని, ఆవిడ అప్పుడప్పుడూ ఇక్కడికి (హైదరాబాద్) కూడా వస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాటలకు బదులుగా సమంత సైగలతో తన సమాధానం చెప్పారు. తన కోసం క్యారెక్టర్లు రాస్తే తప్పకుండా వస్తాను అన్నట్లు తెలిపారు. సమంత చేయరు ఏమో అనే భయంతో తాను రాయడం లేదని త్రివిక్రమ్ సరదాగా అన్నారు. తాను అత్తారింటికి దారేది సినిమా చేశానని, ఇప్పుడు ప్రేక్షకులు అందరూ సమంత గారు హైదరాబాదు రావడానికి దారేది అనేది చెప్పాలని అన్నారు. తెలుగు వాళ్ళు అందరం కలిసి ఒక హ్యాష్ ట్యాగ్ ఏదైనా క్రియేట్ చేసి ట్విట్టర్ అంతా ట్రెండ్ చేద్దామని త్రివిక్రమ్ సూచించారు.

Also Read: మహేష్ ఫ్రెండ్‌కు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఛాన్స్ - ఆమిర్ ఖాన్ నెక్స్ట్ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్!?

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget