Director Ruthvik Yelagari: ప్రభాస్ పాన్ ఇండియా సినిమాకు పని చేసిన కుర్రాడు ఓటీటీ సినిమా 'తత్వ' దర్శకుడని మీకు తెలుసా?
డైరెక్టర్ రుత్విక్ ఏలగరి 'తత్వ' సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాకు దర్శకత్వ శాఖలో వర్క్ చేసిన రుత్విక్ ఏలగరి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా 'తత్వ' (Tatva web film). ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో టాలీవుడ్ మూవీ లవర్స్ ఈ డైరెక్టర్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఆయన ప్రభాస్ సినిమాకు వర్క్ చేశారన్న విషయం తెలిసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ డైరెక్టర్ ప్రభాస్ నటించిన ఏ సినిమాకు పని చేశారు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
ప్రభాస్ మూవీకి పని చేసిన రుత్విక్
రుత్విక్ 'తత్వ' అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో దర్శకుడిగా తెలుగు వీక్షకులకు పరిచయం కాబోతున్నాడు. అయితే ఆయనకు డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా. ట్రైయల్‌గా వెబ్ ఫిల్మ్ తీశాడు. కానీ, ఇది వరకు ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'సాహో' మూవీకి రుత్విక్ పని చేశాడు. ఆ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో రుత్విక్ కూడా వర్క్ చేశాడు. ఇక 'సాహూ' సినిమాకు పని చేసిన వచ్చిన అనుభవంతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు రుత్విక్.
View this post on Instagram
హిమ దాసరి, పూజా రెడ్డి, ఉస్మాన్ గని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'తత్వ' దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. సుమారు ఒక గంట నిడివి ఉండే ఈ సినిమా మొత్తం ఒక క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. మరి ఈ సినిమాతో దర్శకుడిగా రుత్విక్ తానెంటో ప్రూవ్ చేసుకుంటాడా? దసరాకు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్న 'తత్వ' సినిమాతో ఈ దర్శకుడికి అదృష్టం కలిసి వస్తుందా? లేదా? అనేది చూడాలి.
View this post on Instagram
'తత్వ' స్టోరీ ఇదే?
ఈ సినిమాలో ఆరిఫ్ అనే క్యాబ్ డ్రైవర్ పాత్రలో హిమ దాసరి నటించారు. ఈ క్యాబ్ డ్రైవర్ ఓ మర్డర్ కేస్ లో చిక్కుకోవడం చుట్టూ సినిమా సాగుతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన 'తత్వ' ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. అందులో ముఖంపై గాయాలు, చేతికి సంకెళ్లతో ఆరిఫ్ కనిపించగా, పోలీస్ ఆఫీసర్ నిజం చెప్తే ఈ పరిస్థితి నుంచి బయట పడతావని అతనితో చెప్పడం కనిపించింది. ఇక ఆరిఫ్ 'ప్రస్తుతం నా దగ్గర ఉన్నవి రెండు ఆప్షన్లు. ఒకటి అబద్ధం చెప్పి తప్పించుకోవడం, రెండు దొరికిపోవడం... కానీ నాకు తెలియని మూడో ఆప్షన్ కూడా ఉంది' అని ఆరిఫ్ అనుకోవడం, మిగతా సన్నివేశాలు చూస్తే సినిమా ఇంట్రెస్టింగ్ ప్లాట్ తో తెరకెక్కినట్టుగా అనిపిస్తోంది. ట్రైలర్ చూశాక నిజంగా ఆ హత్యను ఆరిఫ్ చేశాడా? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? ఎందుకు పోలీసులు ఆరిఫ్ ని అరెస్ట్ చేశారు? అని అనుమానాలు మొదలయ్యాయి. వీటికి సమాధానం దొరకాలంటే అక్టోబర్ 10న ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతున్న 'తత్వ' అనే సినిమాను చూడాల్సిందే.
Read Also: ‘వేట్టయన్’ స్టోరీలో వేలు పెట్టిన సూపర్ స్టార్ - పట్టుబట్టి మరీ మార్పులు చేయించిన రజనీకాంత్