అన్వేషించండి

Vettaiyan Twitter Review - 'వేట్టయన్' ట్విట్టర్ రివ్యూ: సెకండాఫ్ హైలైట్... డామినేట్ చేసిన రజనీకాంత్ - ఆ ట్విస్ట్ కోసం చూడాల్సిందే

Vettaiyan Movie Review: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన 'వేట్టయన్' ప్రీమియర్ షోలు పడ్డాయి. మరి, ట్విట్టర్ రివ్యూ, ఆడియన్స్ టాక్ ఎలా ఉందో తెలుసుకోండి.

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించిన తాజా సినిమా 'వేట్టయన్: ద హంటర్' (Vettaiyan The Hunter) ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సింగపూర్ సహా కొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సోషల్ మీడియాలో సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా? 

నటనతో డామినేట్ చేసిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఆయన హీరోయిజం అండ్ మేనరిజమ్స్ హైలైట్ అవుతాయి. కానీ, ఈ సినిమాలో ఆయన నటన గురించి ప్రేక్షకులు ఎక్కువ మాట్లాడతారని ఎర్లీ షోస్ రిపోర్ట్ బట్టి మనకు అర్థం అవుతుంది. ఇది యాక్టింగ్ బేస్డ్ సినిమా అని నెటిజనులు చెబుతున్నారు. సినిమా థీమ్ కూడా సూపర్ ఉందట. రజనీ ఫ్యాన్స్‌ కొందరు ఇండస్ట్రీ హిట్ అంటున్నారు.

రజనీకాంత్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి అభిమానులు కోరుకునే మాస్ మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయని టాక్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో రజనీ హీరోయిజం అదిరిందట. ఆయనతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితా‌బ్ బచ్చన్ కూడా మిగతా నటీనటులను డామినేట్ చేశారని తెలిసింది.

Also Read: 'వేట్టయన్' తెలుగు టైటిల్ వివాదం- పేరు ఎందుకు మార్చలేదో క్లారిటీ ఇచ్చిన లైకా ప్రొడక్షన్స్


ఇంటర్వెల్, సెకండాఫ్ సినిమా హైలైట్స్!
దర్శకుడు టీజే జ్ఞానవేల్ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేయడానికి సినిమా స్టార్టింగ్ నుంచి కొంత సమయం తీసుకున్నారని ట్విట్టర్ టాక్. ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమా పిక్ అప్ అయ్యిందట. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు పరుగులు పెట్టిందట. ఇంటర్వెల్ సెకండాఫ్ సినిమాకు హైలైట్స్ అవుతాయని... మంచి ట్విస్టుతో కూడిన సందేశాన్ని చెప్పారట. ఆ ట్విస్ట్ ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాలి.  

రానా దగ్గుబాటి... ఫహాద్ ఫాజిల్ కూడా!
'వేట్టయన్: ద హంటర్' సినిమాలో టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి (Rana Daggubati) విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రానాపై రజనీకాంత్ పొగడ్తల వర్షం కురిపించారు. రామానాయుడు గారి మనవడిగా రానాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, తన కళ్ళ ముందు పెరిగిన ఆ యువకుడు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చూస్తే భయపడ్డానని చెప్పారు. 

Also Read: థియేటర్లు దద్దరిల్లేలా 'గుంగురూ గుంగురూ'... గోపీచంద్ సినిమాకు భీమ్స్ మాస్ బీట్


సినిమాలో రానా పాత్రతో పాటు ఆయన నటన కూడా చాలా బాగుందట. పుష్ప సినిమాలో షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటన సైతం బావుందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో సినిమా గురించి ఆడియన్స్ ఏమని చెబుతున్నారో కింద ట్వీట్లలో చూడండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget