Viswam: థియేటర్లు దద్దరిల్లేలా 'గుంగురూ గుంగురూ'... గోపీచంద్ సినిమాకు భీమ్స్ మాస్ బీట్
Gopichand: గోపీచంద్ లేటెస్ట్ సినిమా 'విశ్వం'కు చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. అయితే, ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియోను తీసుకు వచ్చారు. ఆయనతో ఓ పాట చేయించారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'విశ్వం' (Viswam). విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 11న (ఈ శుక్రవారం) థియేటర్లలోకి ఈ సినిమా వస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలు రెస్పాన్స్ పర్వాలేదు. అయితే, త్వరలో విడుదల కాబోయే పాటకు మాత్రం థియేటర్లు దద్దరిల్లుతాయని తెలిసింది. ఆ పాటకు బాణీ అందించినది, రాసినది ఎవరంటే?
భీమ్స్ బీటులో 'గుంగురూ గుంగురూ'
'విశ్వం' చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. అయితే... ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) దగ్గరకు వెళ్లారు చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల. ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ అని, ఆడియన్స్ అంతా స్టెప్పులు వేస్తారని యూనిట్ సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
'విశ్వం' కోసం 'గుంగురూ గుంగురూ...' సాంగ్ కంపోజ్ చేశారు భీమ్స్ సిసిరోలియో. ఆ పాటను సురేష్ గంగుల రాశారు. ఇంతకు ముందు భీమ్స్ సంగీతంలో 'పేపర్ బాయ్' కోసం సురేష్ గంగుల రాసిన 'బొంబాయి పోతావా రాజా' ఆడియన్స్ అందరి చేత స్టెప్పులు వేయించింది. పబ్బుల్లో, డిస్కోల్లో, బారత్ వేడుకల్లో బలంగా వినిపించింది. అంతకు మించి అనేలా 'గుంగురూ గుంగురూ' ఉంటుందట. ఈ పాటను 'విశ్వం' సినిమా యూనిట్ త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
This festival season, it is all about MachoStar @YoursGopichand's MASSY DANCE MOVES ❤️🔥🤩#GunguruGunguru, a MASSIEST Chartbuster from #Viswam out soon 🥁🔥
— People Media Factory (@peoplemediafcy) October 8, 2024
GRAND WORLDWIDE RELEASE on October 11th ❤️@KavyaThapar @vishwaprasadtg @peoplemediafcy @VenuDonepudi @ChitralayamOffl… pic.twitter.com/AkoE4mqrxC
తెలుగు సంగీత దర్శకులలో భీమ్స్ సిసిరోలియోది ప్రత్యేకమైన శైలి. 'బలగం' వంటి సినిమాలకు హృద్యమైన పాటలు అందించారు. ఎట్ ద సేమ్ టైమ్... రవితేజ 'ధమాకా' వంటి సినిమాలకు హుషారైన ఎనర్జిటిక్ పెప్పీ మాస్ నంబర్స్ కూడా ఇచ్చారు. 'పీఎస్వీ గరుడవేగ'లో సన్నీ లియోన్ మీద తెరకెక్కించిన 'డియో డియో...' సాంగ్, రవితేజ 'రావణాసుర'లో డిక్కా డిష్షుం', అఖిల్ అక్కినేని 'ఏజెంట్'లో 'వైల్డ్ సాలా' సాంగ్స్ కంపోజర్ ఆయనే. ఇప్పుడు గోపీచంద్ 'విశ్వం' కోసం మరో స్పెషల్ సాంగ్ చేశారు.
ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని...యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'విశ్వం' సినిమాను రూపొందించారు. శ్రీను వైట్లకు ఇటువంటి తీయడంలో సపరేట్ స్టైల్ ఉంది. 'ఢీ', 'రెడీ', 'వెంకీ', 'దూకుడు' వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. 'విశ్వం' కూడా విజయాల పరంగా ఆ సినిమాల సరసన చేరుతుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని టాక్. గోపీచంద్, సీనియర్ నరేష్, 'వెన్నెల' కిశోర్, వీటీవీ గణేష్ తదితరులతో తీసిన ట్రైన్ ఎపిసోడ్... 'వెంకీ'లో ట్రైన్ సీక్వెన్సును మ్యాచ్ చేస్తుందని చెబుతున్నారు.
Also Read: మొన్న చుట్టమల్లె... ఇప్పుడు 'ఊ అంటావా మావ' - తెలుగులో ఆలియా భట్ పాట కేక