Alia Bhatt: మొన్న చుట్టమల్లె... ఇప్పుడు 'ఊ అంటావా మావ' - తెలుగులో ఆలియా భట్ పాట కేక
Jigra Pre Release Event Hyderabad: ఆలియా భట్ మరోసారి తెలుగులో పాట పాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొన్న 'దేవర'లో పాట పాడితే... ఈసారి 'పుష్ప' సినిమాలో పాట పాడారు.
ఆలియా నోట... తెలుగు పాట - వింటున్నా, చూస్తున్నా ఎంతో ముద్దు ముద్దుగా ఉంటుందట! ఈ మాట చెప్పడంలో మరో సందేహం అసలు అవసరం లేదని చెప్పాలట. ఒక్కసారి తెలుగులో ఆలియా భట్ పాడిన పాటలు వింటుంటే ఆ మాటలే చెప్పాలి మరి.
మొన్న చుట్టమల్లె... ఇప్పుడు ఊ అంటావా మావ
Alia Bhatt Singing Oo Antava Oo Oo Antava In Jigra Pre Release Event: హిందీ హీరోయిన్లు చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అయితే... అందులో కొంత మంది మాత్రమే తెలుగు భాషకు గౌరవం ఇస్తున్నారు. ఆ కొంత మందిలో అలియా భట్ ఒకరు.
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'లో సీత పాత్రలో అలియా భట్ నటించారు. అప్పట్లో ఆ సినిమా కోసం తెలుగులో కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె తెలుగులో మాటలు చెప్పడం మాత్రమే కాదు... ఓ అడుగు ముందుకు వేసి పాటలు కూడా పాడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్, కరణ్ జోహార్‌తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియా భట్ 'చుట్టమల్లె...' సాంగ్ పాడారు.
ఆలియా భట్ (Alia Bhatt), వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా 'జిగ్రా' (Jigra Movie). శుక్రవారం (ఈ నెల 11న) హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో పార్క్ హయత్ హోటల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దానికి సమంత, మాటల మాంత్రికుడు - గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఆ ఈవెంట్‌లో 'ఊ అంటావా ఊఊ అంటావా మావ' పాట పాడారు. అది సమంతకు డేడికేట్ చేశారు. 'ఊ అంటావా ఊఊ అంటావా మావ' పాట పాడటం మాత్రమే కాదు... 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేశారు ఆలియా భట్.
Also Read: హీరోల్లో రజనీకాంత్... హీరోయిన్లలో సమంత, అప్పట్లో బన్నీ కూడా ఆమెకు ఫ్యాన్ - త్రివిక్రమ్
త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంతతో కలిసి...
'జిగ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆలియా భట్ మాట్లాడుతూ... ''త్రివిక్రమ్ మాట్లాడిన ప్రతి మాట నా గుండెల్ని తాకింది. సమంత రియల్ హీరో... అది ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో కూడా! పురుషాధిక్య ప్రపంచంలో, ఈ సినిమా ఇండస్ట్రీలో తన నటనతో సినిమా ఇండస్ట్రీలో నిలబడటం అంత ఈజీ కాదు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే... ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. 'నాటు నాటు...' పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటుంది. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. 'గంగూభాయ్', 'బ్రహ్మాస్త్ర' సినిమాలను తెలుగులో విడుదల చేశాం. 'జిగ్రా'ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అక్టోబర్ 11న మా సినిమా వస్తుంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్... ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. ఆడియన్స్ అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా'' అని అన్నారు.
Also Read: మహేష్ ఫ్రెండ్‌కు మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఛాన్స్ - ఆమిర్ ఖాన్ నెక్స్ట్ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్!?