వేడి వాతావరణంలో ఫ్యాన్ స్పీడుగా పెట్టుకుని నిద్రపోతున్నారా? జాగ్రత్త!
ఫ్యాన్ గాలి వల్ల ధూళీ రేణువులు, పుప్పొడి గాలిలో లేచి ఆస్తమా, ఎలర్జీలతో బాధపడుతున్న వారికి ఫ్యాన్ గాలివల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
జూన్ రెండో వారం గడుస్తున్నా రుతుపవనాల జాడలేదు, కనుక ఇంకా కొన్ని రోజుల పాటు ఈ వేడి ఇలాగే కొనసాగేట్టే కనిపిస్తోంది. ఇలాంటి వాతావరణంలో 24 గంటలూ ఫ్యాన్ నడుస్తూ ఉండాల్సిందే. ఫ్యాన్ వల్ల గదిలో గాలి కదులుతూ వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గదిలో తిరుగుతున్న మీ ఫ్యాన్ ను ఒక సారి గమనించి చూడండి. దాని బ్లేడ్ ల మీద దుమ్ము కనిపిస్తుంటే అది ఆన్ చేసిన ప్రతి సారీ కణాలు గాలిలో ఎగురుతాయి. ఫ్యాన్ పెద్ద స్పీడులో పెట్టుకోవడం వల్ల చర్మం కూడా పొడిబారి పోతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. అంతేకాదు పెద్ద ఫ్యాన్ గాలి వల్ల నాసికా మార్గాలు కూడా పొడిబారి పోతాయి. ముఖానికి, మెడకు నేరుగా గాలి తగిలే విధంగా ఫ్యాన్ కు దగ్గరగా పడుకుంటే ఉదయాన్నే స్టిఫ్ నెక్ సమస్యతో మెలకువ వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. నిరంతరంగా తగిలే గాలి వల్ల కండరాలు బిగుసుకుపోతాయి.
ఈ చిట్కాలు పాటిస్తే చాలు
- రాత్రి పూట ఫ్యాన్ చిన్నగా పెట్టుకొని పడుకోవడం కష్టం అనిపించే వారు మంచం దగ్గర ఒక గిన్నెలో చల్లని నీళ్లు పెట్టుకుని అప్పుడప్పుడు కర్చిఫ్ లేదా నాప్కిన్ అందులో ముంచి మీకు అవసరం అనుకున్న చోట కాపడం పెట్టుకోవచ్చు.
- నిద్రకు ముందు చల్లని నీళ్లతో స్నానం చెయ్యడం కూడా మంచి ఆప్షన్ అని నిపుణులు సలహా ఇస్తున్నారు.
- మధ్యాహ్న సమయాల్లో కిటికీలు తలుపులు మూసి ఉంచుకోవాలి.
- రాత్రిపూట కిటికీలు తెరచి పెట్టుకుని నిద్ర పోవడం మంచిది. దీని వల్ల మధ్యాహ్న సమయంలో ఉండే వేడి ఇంటిలోపలికి చేరకుండా ఉంటుంది. సాయంత్రం చల్లని గాలి గదిని చల్లబరుస్తుంది.
- కుదిరితే ఫ్యాన్ ఉపయోగించకుండా ఉండడం మంచిది. అది సాధ్యపడదని అనిపిస్తే ఏయిర్ పిల్టర్లను వాడడం వల్ల కొంత మంచి ఫలితాలు ఉంటాయి.
- ఎంత వేడిగా ఉన్నా సరే దుస్తులు లేకుండా మాత్రం నిద్ర పోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
- సాధారణ అలెర్జీల వల్ల వచ్చేదే హే ఫీవర్. ఇది చాలా సాదారణంగా కనిపించే సమస్య. ప్రతి ఐదుగురిలో ఒకరు దీని బారిన పడవచ్చు.
పోలన్ అలెర్జీ ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి
- తరచుగా తుమ్ములు రావడం
- మక్కు కారడం, ముక్కు దిబ్బడ
- దురదగా ఉండడం, కళ్లు ఎర్రగా మారి నీరు కారడం
- చెవులు, గొంతు, నోరు, ముక్కులో దురద
- దగ్గు, పోస్ట్ నాస్ట్రల్ డిప్ (ముక్కు వెనుక నుండి శ్లేష్మం గొంతులో కారుతుంది)
చాలా తక్కువ సందర్బాల్లో వాసన గుర్తించలేకపోవడం, సైనస్ లు మూసుకుపోవడం వల్ల ముఖం మీద నొప్పి, తలనొప్పి, చెవినొప్పి, అలసటగా ఉండడం, ఆస్తమా ఉన్న వారికి లక్షణాలు మరింత తీవ్రమవుతాయి.
Also read : వేసవి వేడి నిద్రపట్టనివ్వడం లేదా? ఇవిగో ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపోతారు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.