News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వేసవి వేడి నిద్రపట్టనివ్వడం లేదా? ఇవిగో ఈ చిట్కాలు పాటిస్తే హాయిగా నిద్రపోతారు!

వేసవిలో మనం తీసుకునే ఆహారం నుంచి పడుకునేందుకు ఎంచుకునే పరుపు వరకు అనేక అంశాలు నిద్రను ప్రభావితం చేస్తాయని సుజీ రీడింగ్ అనే శాస్త్రవేత్త అనేక విషయాలను చర్చిస్తున్నారు.

FOLLOW US: 
Share:

వేడి గా ఉండే వేసవి రాత్రుల్లో నిద్ర పోవడం కష్టంగా ఉంటుంది. ఒక వైపు వేడి, మరోవైపు ఉక్కపోత నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ సూర్య రశ్మి లేనపుడు మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. అందువల్ల రాత్రి నిద్ర వస్తుంది. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తిలో కూడా తేడాలు ఏర్పడుతాయని అందువల్ల నిద్ర పోవడం కష్టంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడతున్నారు. వేసవి వేడి రాత్రుల్లో మంచి నిద్రకు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు స్లీప్ ఎక్స్ పర్ట్ సూజి

వదులుగా ఉండే దుస్తులు

ఫైబర్, పత్తి, యూకలిప్టస్ లేదా జూట్ వంటి సహజమైన ఫైబర్లు వాడి తయారు చేసిన వదులు దుస్తులు ధరించాలని సూజీ సూచిస్తున్నారు. ఎంత వేడిగా ఉన్నా సరే నగ్నంగా నిద్రపోవడాన్ని మాత్రం తాను సిఫారస్ చెయ్యనని అంటున్నారు. ఎందుకంటే ఒంటి మీది చెమట ను పీల్చుకున్న దుస్తుల వల్ల శరీరానికి ఒక కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. నగ్నంగా నిద్రించడం చర్మ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కనుక వదులుగా ఉండే కాటన్ దుస్తులు రాత్రి వేళల్లో ధరించడం మంచిది.

ఏం తినాలి?

కారం లేదా కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. వీటిని తీసుకున్నపుడు శరీరంలో వేడి పుడుతుంది. అంతేకాదు ఆల్కహాల్ కూడా పరిమితి కంటే తక్కువ తీసుకోవాలని సూజి సూచిస్తున్నారు. తీసుకోకపోవడం ఉత్తమంగా చెబుతున్నారు. ఆల్కహాల్ వినియోగం వల్ల కొన్ని గంటల పాటు మంచి నిద్ర పోయినప్పటికీ నిద్ర సరిపోయిన భావన కలగదు. సోయా సాస్, టోఫు వంటి ఫర్మెంటెడ్ పదార్ధాలు, సిట్రస్ పండ్లలో కూడా టైరమైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది బ్రెయిన్ యాక్టివిటిని పెంచుతుంది. కనుక నిద్ర పట్టదు.

ఎలాంటి బెడ్ ?

కాటన్, లినెన్, సిల్క్ లేదా జూట్ వంటి తేలిక పాటి సహజమూన ఫైబర్లతో తయారు చేసిన పరుపులను ఎంచుకోవాలని సూజి సూచించారు. లేత రంగుల్లో, తేలికైన షీట్స్ వాడడం మంచిది. ఇవి చల్లగా ఉంటాయి. ప్రశాంతమైన ఫీలింగ్ ను ఇస్తాయి.

రాత్రి స్నానం

ఫ్రిజ్ లో ఉంచిన కూలింగ్ ఫేషియల్ మిస్ట్ ను ఉపయోగించడంతో పాటు సాయంత్రం పూట కచ్చితంగా స్నానం చెయ్యాలని సుజీ సిఫారసు చేసింది. పడుకోవడానికి 1-2 గంటల ముందు స్నానం చెయ్యడం వల్ల మంచి నిద్రకు దోహదం చేస్తుందని శాస్త్రీయంగా రుజువులున్నాయని ఆమె స్పష్టం చేశారు.

వేసవిలో మంచి నిద్రకు కొన్ని చిట్కాలు

  • రాత్రి పూట తేలికైన ఆహారం తీసుకోవడం మంచిది.
  • సాయంత్రం పూట వ్యాయామం చెయ్యకూడదు.
  • మధ్యాహ్నాలు చాలా వేడిగా ఉంటుంది కనుక బెడ్ రూం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల గది ఎక్కువగా వేడిగా ఉండదు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తలుపులు తెరచి చల్లని గాలి ఇంట్లోకివచ్చేందుకు అనుమతించాలి. ఇలా చెయ్యడం వల్ల సహజంగా గది చల్లబడుతుంది.
  • నిజానికి నేల మీద పడుకోవడం ఒక మంచి ఆప్షన్ అలా పడుకోవడం అలవాటు లేదని అనుకునే వారు స్ప్రింగ్ పరుపులు వాడుకోవడం మంచిది

Also read : ఎంత ప్రయత్నించినా నిద్రపట్టడం లేదా? మిమ్మల్ని మీరు ఇలా మోసం చేసుకుంటే నిద్రే నిద్ర!

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 13 Jun 2023 07:00 PM (IST) Tags: Sleep Summer hot nights

ఇవి కూడా చూడండి

Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా

Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా

Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది

Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది

Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా

Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా

Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి

Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి

Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం

Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం

టాప్ స్టోరీస్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?

చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?