By: ABP Desam | Updated at : 09 Jun 2023 08:15 PM (IST)
Representational image/Pexels
ఈ మధ్య కాలంలో నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. చాలామంది త్వరగా నిద్ర పట్టడం లేదని కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ కరణా రాజన్ తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. తాను డాక్టర్‌గా వృత్తి మొదలు పెట్టిన కొత్తలో నిద్రలేమితో బాధపడ్డానని చెప్పారు. అయితే ఆ సందర్బంలో తాను కాస్త ప్రతికూలమైన హ్యాక్ ఒకదాన్ని ట్రై చేశానని, అది రివర్స్ సైకాలజి లాంటి లేదా పారాడాక్సికల్ ఇంటెన్స్ తో కూడిందని తెలిపారు. అది పనిచేస్తుందని తాను అనుకోలేదని, కానీ ఆశ్చర్యంగా అది తనకు చాలా త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నారు.
‘‘నిద్ర రావడం లేదు అని అనిపించగానే.. ‘ఇక నేను నిద్రపోను’ అనుకోండి. అలా అని బుక్ చదడమో, టీవీ చూడడమో, ఫోన్ స్క్రోల్ చెయ్యడం లాంటివేవీ చెయ్యకూడదు. సింపుల్ గా నేను నిద్రపోను అని అనుకోవాలి అంతే. ఇదెలా అంటే మంచం మీద పడుకొని మిమ్మల్ని మీరు ఇక నిద్ర పోకూడదు అని బలవంత పెట్టడం లాంటిదన్న మాట. నిద్రపోవద్దు పోవద్దు అని మీకు చెప్పుకుంటూ ఉండండి. చాలా సార్లు మీరు అలసి పోయి ఉంటారు.. నిద్రపోవద్దు అని చెప్పడం ద్వారా పదేపదే నిద్రను గుర్తు చేస్తుంటారు. నిద్ర పోవద్దు అనే సూచన ఇచ్చిఇచ్చి అలసిపోయి.. మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు’’ అని డాక్టర్ రాజన్ తెలిపారు.
‘‘ఎవరైనా మీకు దేని గురించైనా ఆలోచించవద్దు అని చెబితే.. ముందుగా మీ ఆలోచనలోకి వచ్చేది ఏమిటి? దేని గురించి ఆలోచించకూడదో అదే కదా. అలాంటిదే ఈ రివర్స్ సైకాలజీ కూడా’’ అని తెలిపారు. త్వరగా నిద్రలోకి జారుకునేందుకు మరో చిన్న చిట్కా కూడా ఆయన ఆ వీడియోలో పంచుకున్నారు. దానికి ఆయన 10- 3-2-1 మెథడ్ అని పేరుపెట్టారు. నిద్రకు ఉపక్రమించేందుకు 10 గంటల ముందు నుంచి కెఫిన్ వాడకూడదు. పడుకోవడానికి 3 గంటల ముందు నుంచే లార్జ్ మీల్స్ కి గుడ్ బై చెప్పాలి.
మీరు నిజంగా నిద్రలేమితో బాధ పడుతున్నారో తెలుసుకోవాలనుకుంటే కింది లక్షణాల్లో ఏవైనా మీకు ఉన్నాయోమో పరిశీలించి చూసుకుంటే మంచిది.
ఈ లక్షణాలతో పాటు పని మీద ఏకాగ్రత కుదరకపోవడం, ఎప్పుడూ మూడ్ సరిలేకపోవడం, విసుగ్గా అనిపించడం, చేసే పని నాణ్యత తగ్గడం ఇలా రకరకాల సమస్యలు నిద్ర లేమి వల్ల కలుగుతాయి. ఈ డాక్టర్ సూచించిన చిట్కాలు తప్పకుండా పనిచేస్తున్నాయని చాలామంది నెటిజన్లు చెబుతున్నారు. మీరూ ట్రై చేసి చూడండి.
Also read : మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Curd: పెరుగు మిలిపోయిందా? ఇదిగో ఈ టేస్టీ వంటలు చేసేయండి
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Apple: రాత్రి వేళల్లో ఆపిల్ పండ్లు తినకూడదా? తింటే ఏమవుతుంది?
Salt: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
Heart Diseases: ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త!
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>