అన్వేషించండి

Heart: గంటలు గంటలు కూర్చుని అతిగా పనిచేసేస్తున్నారా? గుండెపై ప్రభావం పడక తప్పదు

Heart: ఆఫీసుల్లో కదలకుండా కూర్చుని పని చేసే వారికి కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Heart: మనదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఉత్పాదకత మెరుగుపడాలి. అంటే మరిన్ని ఎక్కువ గంటలు కూర్చుని పని చేయాలి. ఇలా చేయడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది, కానీ ఉద్యోగుల ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది. ముఖ్యంగా గుండెపైన ప్రభావం పడుతుంది. ఎక్కువ పని గంటలు ఉత్పాదకతను పెంచవచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం క్షీణించేలా చేస్తాయి. మానసిక ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. ఆఫీసుల్లో చాలామంది కదలకుండా గంటలు గంటలు కూర్చొని పనిచేస్తూ ఉంటారు. వీరు త్వరగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది.

శరీరంలో గుండె ముఖ్యమైన అవయవం. శరీరం అంతటా రక్తం, రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అన్ని అవయవాలకు చేరాలి. అంటే గుండె సక్రమంగా పనిచేయాలి. మన శరీరం సజీవంగా ఉండాలంటే గుండె అవిశ్రాంతంగా పనిచేయాల్సిందే. అయితే ఎక్కువ పని గంటలు కదలకుండా కూర్చుని పని చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. రోజుకు 8 నుంచి 9 గంటలు కదలకుండా పనిచేసినా చాలు గుండె జబ్బులు వచ్చే అవకాశం 40 శాతం అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక అంతకంటే ఎక్కువ కాలం కూర్చుని పని చేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. రక్తపోటు పెరిగిపోతుంది. ఇది రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు లేదా మెదడు స్ట్రోక్ కు వచ్చేలా చేస్తుంది.

కాబట్టి ఆఫీసులో గంటలు గంటలు కూర్చొని పనిచేయడం మానేయాలి. ప్రతి గంటన్నరకు ఒకసారి లేచి ఒక ఐదు నిమిషాలు వాకింగ్ చేసి రావడం చాలా ముఖ్యం. శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా గుండె జబ్బులు వస్తాయి. అలాగే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. బరువు కూడా త్వరగా పెరిగిపోతారు.  ఆఫీసులో ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఒత్తిడి స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే యువకుల్లో ఈ మధ్యకాలంలో గుండెపోటు ఎక్కువగా వస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకి 12 గంటల పాటు పనిచేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ.

వారంలో కనీసం ఐదు గంటలు వాకింగ్ చేయడానికి కేటాయించాలి. రిలాక్స్ అయ్యే అలవాట్లను పాటించాలి. నిత్యం పనిలోనే పడితే మీకు తెలియకుండానే శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది. ఏ క్షణం మీ గుండె ఆరోగ్యం క్షీణించి కొట్టుకోవడం ఆగిపోతుందో కూడా చెప్పలేం. కాబట్టి ఉద్యోగులు అధిక పనికి సెలవు చెప్పి, కూల్ గా పని చేసుకునే పరిస్థితులను సృష్టించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good Friday and Easter : గుడ్ ఫ్రైడే, ఈస్టర్.. క్రైస్తవులు చేసుకునే ఈ పండుగల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే
గుడ్ ఫ్రైడే, ఈస్టర్.. క్రైస్తవులు చేసుకునే ఈ పండుగల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే
Ginger Garlic Paste : అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచే సీక్రెట్ ఇదే!
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.. ఎక్కువ రోజులు నిల్వ ఉంచే సీక్రెట్ ఇదే!
Warning Signs of Liver : ముఖంలో ఈ మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు.. అవే లివర్ డ్యామేజ్ సంకేతాలు కావచ్చు
ముఖంలో ఈ మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయొద్దు.. అవే లివర్ డ్యామేజ్ సంకేతాలు కావచ్చు
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget