Its Official - SK20: రెండు టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్‌లో తమిళ హీరోతో 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా
తమిళ హీరో శివ కార్తికేయన్‌తో 'జాతి రత్నాలు' దర్శకుడు కేవీ అనుదీప్ ఓ సినిమా చేయనున్నారు. రెండు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాయి.
తమిళ హీరో శివ కార్తికేయన్ (sivakarthikeyan) స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. అనువాద సినిమాలు 'సీమ రాజా', 'రెమో', 'శక్తి', 'డాక్టర్'తో ఆయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా ఓకే చేశారు. శివకార్తికేయన్ 20వ సినిమా (SK20) ఇది. అఫీషియల్‌గా అతడికి టాలీవుడ్ ఎంట్రీ. టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. తమన్ సంగీతం అందించనున్నారు. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమాను ప్రకటించారు.
Very happy to join with @AsianSuniel sir @SBDaggubati sir & my frnd @iamarunviswa for #SK20 ,directed by my fav @anudeepfilm & music by @MusicThaman bro😊
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2022
A fun-filled entertainer on the way👍❤️#NarayanDasNarang @SVCLLP @SureshProdns #PuskurRamMohanRao @ShanthiTalkies pic.twitter.com/3g5sjGCePH
శివ కార్తికేయన్, సంగీత దర్శకుడు తమన్ కాంబినేషన్‌లో తొలి సినిమా ఇది. "నా క్రికెట్ మేట్, డియర్ ఫ్రెండ్ శివ కార్తికేయన్‌తో తొలి సినిమా ఇది. సూపర్ హిలేరియస్ పర్సన్ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నారు" అని తమన్ ట్వీట్ చేశారు. "నీతో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నీ హిట్ ట్యూన్స్ కి డాన్స్ చేయడానికి ఎదురు చూస్తున్నాను" అని శివ కార్తికేయన్ రిప్లై ఇచ్చారు.
Brooooo really happy to join with you 🤗🤗 waiting to dance for ur hit numbers 💥💥👍 https://t.co/HRKNSJQyzM
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) January 1, 2022
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
Also Read: ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి