Arjuna Phalguna Movie Review - 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Sree Vishnu and Amritha Aiyer's Arjuna Phalguna Movie Review: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటించిన సినిమా 'అర్జున ఫల్గుణ'. ఈ రోజు విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉంది?
Teja Marni
Sree Vishnu, Amritha Aiyer, Senior Naresh, Sivaji Raja, Subba Raju, Devi Prasad, Rangasthalam Mahesh, Raj Kumar Kasireddy, Chaitanya Garikipati and Others
సినిమా రివ్యూ: అర్జున ఫల్గుణ
రేటింగ్: 1.5/5
నటీనటులు: శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, వీకే నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, 'రంగస్థలం' మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు
మాటలు: సుధీర్ వర్మ .పి
పాటలు: చైతన్య ప్రసాద్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజ మార్ని
విడుదల తేదీ: 31-12-2021 (ఆహా ఓటీటీలో)
జయాపజయాలకు సంబంధం లేకుండా వైవిధ్యమైన కథలు ఎంపిక చేసుకుని, కొత్త సినిమాలు చేసే హీరో శ్రీ విష్ణు. ఆయనకు ఈ ఏడాది 'గాలి సంపత్' పరాజయం ఇవ్వగా, 'రాజ రాజ చోర' విజయం అందించింది. మరి, 'అర్జున ఫల్గుణ' ఎలా అనిపించింది? ఓటీటీలో విడుదలైన 'జోహార్'తో ప్రశంసలు అందుకున్న తేజ మర్ని రెండో సినిమాలో ఏం చేశాడు?
కథ: అర్జున్ (శ్రీ విష్ణు)ది గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరు. అతడు డిగ్రీ చదివాడు. కానీ, ఉద్యోగం గట్రా ఏమీ చేయడు. ఉదయాన్నే పాలు పోయడం, స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పడం, ప్రేమించిన అమ్మాయితో కలిసి తిరగడం... అతడు చేసేది అంతే! అయితే... స్నేహితుల్లో ఒకరి తండ్రి వ్యవసాయం కోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని సకాలంలో చెల్లించకపోవడంతో ఇల్లు జప్తు చేయడానికి అధికారులు వస్తారు. ఓసారి అర్జున్ అడ్డుకుంటాడు. తర్వాత స్నేహితుల అప్పులు తీర్చడానికి గంజాయి స్మగ్లింగ్ చేయడానికి అంగీకరిస్తాడు. ఆ నిర్ణయం వల్ల ఎన్ని తిప్పలు ఎదుర్కొన్నారు? ఎటువంటి అడ్వెంచర్ చేయాల్సి వచ్చింది? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: ఇదొక రొటీన్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. గంజాయ్ స్మగ్లింగ్ పాయింట్ యాడ్ చేసి... కొత్తగా తీయాలని దర్శకుడు తేజ ట్రై చేశారు. గంజాయ్ స్మగ్లింగ్ పాయింట్ తీసుకురావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాడని చెప్పాలి. అప్పటివరకూ కథలో పెద్దగా చలనం ఉండదు. కానీ, గోదావరి నేపథ్యాన్ని బాగా చూపించారు. సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంది. టైటిల్స్ పడేటప్పుడు వచ్చే 'గోదారోళ్లే...' పాట బావుంది. అయితే... అసలు కథ మొదలు అయ్యేసరికి ఏం చేస్తున్నామో? ఏ జానర్ సినిమా చూస్తున్నామో? అనేది ఆడియన్‌కు అర్థం కాదు. అప్పటికి విసుగు మొదలు అవుతుంది. రొటీన్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ నుంచి యాక్షన్ థ్రిల్లర్ మోడ్‌లోకి సినిమా మారుతుంది. మళ్లీ క్లైమాక్స్‌లో కామెడీ టర్న్ తీసుకుంది. సినిమాలో కొన్ని థ్రిల్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఓకే. కానీ, అన్నిటిని ఓ ప్యాకేజ్‌లా చూస్తే మాత్రం డిజప్పాయింట్ చేస్తుంది. తాను చెప్పాలనుకున్న కథను ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
శ్రీ విష్ణు ఎప్పటిలా తన పాత్రకు న్యాయం చేశాడు. కథానాయిక అమృతా అయ్యర్ మంచి పెర్ఫార్మర్. అయితే... ఆమెకు అంత స్కోప్ దక్కలేదు. నిజం చెప్పాలంటే.. సినిమాలో క్యారెక్టర్లకు మంచి ఆర్టిస్టులను దర్శకుడు ఎంపిక చేసుకున్నాడు. శ్రీ విష్ణు, సుబ్బరాజ్, శివాజీ రాజా, వీకే నరేష్, హీరో స్నేహితులుగా నటించిన ముగ్గురు... అందరూ బాగా చేశారు. సన్నివేశాల పరంగా చూస్తే... అందరూ బాగా నటించారు. గోదావరి వెటకారం కొంత వరకూ వర్కవుట్ అయ్యింది. గ్రామ వాలంటీర్‌గా ఉద్యోగం వచ్చిన తర్వాత హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంటే... జాతరకు మేకపోతు దొరకలేదా? అని హీరో స్నేహితుడు అనడం, ఏపీలో చీప్ లిక్కర్ ప్రెసిడెంట్ మెడల్ మీద డైలాగ్స్ వంటివి నవ్విస్తాయి. శ్రీవిష్ణు, శివాజీ రాజా మధ్య సీన్స్ కూడా పర్వాలేదు. అయితే... ఎమోషన్స్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో సినిమా కూడా కనెక్ట్ కాదు. 'నాది కాని కురుక్షేత్రంలో, నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా... బలై పోవడానికి నేను అభిమన్యుడిని కాదు, అర్జునుడిని' అని సినిమాలో శ్రీ విష్ణు ఓ డైలాగ్ చెప్పారు. సినిమా చూశాక.... ఆ డైలాగ్‌లో ఉన్న ఫోర్స్ సినిమాలో లేదని అనిపిస్తుంది.
Also Read: 'శ్యామ్ సింగ రాయ్' రివ్యూ: తిరగబడిన సంగ్రామమా? ఎగసిపడిన అలజడా?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'పుష్ప' రివ్యూ: సినిమా ఎలా ఉందంటే...?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి