అన్వేషించండి
RRR Posteponed?: ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?
'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల మరోసారి వాయిదా పడిందా? సంక్రాంతి బరి నుంచి సినిమా తప్పుకొందా? అంటే 'అవును' అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్, ఎన్టీఆర్
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. సంక్రాంతి బరి నుంచి సినిమా తప్పుకొందని ప్రచారం జరుగుతోంది. నిజం చెప్పాలంటే... ఇప్పటికే సినిమా రెండు మూడుసార్లు వాయిదా పడింది. అప్పుడు కరోనా కారణంగా సినిమా షూటింగ్ కాలేదు. ఇప్పుడు పరిస్థితి వేరు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. జనవరి 7న సినిమా విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు. ఓవర్‌సీస్‌కు ప్రింట్స్ పంపించేశారు. ప్రచారం స్టార్ట్ చేశారు. ముంబై, చెన్నై, కొచ్చిలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా నిర్వహించారు. ఈ సమయంలో ఎందుకు వాయిదా వేయాలని అనుకుంటున్నారు? అంటే... బహుశా కరోనా కారణం అని చెప్పాలి.
దేశంలో మళ్లీ కరోనా, ఓమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. దాంతో సినిమాను విడుదల చేయడం కంటే వాయిదా వేయడం మంచిదని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నదట. త్వరలో వాయిదా వార్తను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. సినిమా వాయిదా పడుతుందనే విషయం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వాయిదా పడిందనే విషయం వాళ్లను డిజప్పాయింట్ చేసింది.
కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
'ఆర్ఆర్ఆర్'తో పాటు 'రాధే శ్యామ్' కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. మరి, ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో మరి? లేదంటే సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేస్తారో?
Also Read: షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!
Also Read: బాలకృష్ణతో సినిమా ప్రకటించిన దర్శకుడు... స్క్రిప్ట్ రెడీ!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: 'గాలోడు' టీజర్.. సుడిగాలి సుధీర్ మాస్ అవతార్..
Also Read: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement

Nagesh GVDigital Editor
Opinion