అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘300’ ఇన్‌స్పిరేషన్‌తో SDT18, నటనలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మెగాస్టార్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘300’ ఇన్‌స్పిరేషన్‌తో SDT18 నుంచి నటనలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మెగాస్టార్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్  2024లో సాయి ధరమ్ తేజ్ తన తర్వాతి సినిమా SDT18 ‘300’ ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కుతోందని తెలిపారు. అలాగే హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయవద్దని తెలిపారు. నటనలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘స్పైడర్ మ్యాన్ 4’ సినిమాను 2026 జులై 24వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జ్యోతికతో సినిమా ఎప్పుడు చేస్తున్నారనే ప్రశ్నపై సూర్య స్పందించారు.

ఆ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో - ‘SDT18’
ABP సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న సాయి దుర్గ తేజ్ ‘SDT18’ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు తనలో చాలా  ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు వెల్లడించారు. జాక్ స్నైడర్ ఎపిక్ మూవీ 300 నుంచి ప్రేరణ పొంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు "‘SDT18’ నా కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘300’ నుంచి ప్రేరణ పొంది చేస్తున్నాం. తెలుగు ప్రజలు గర్వించేలా ఈ సినిమా ఉండబోతోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మరో లెవల్ కు తీసుకుపోతుంది” అని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

50 ఏండ్ల నట ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా ఏమాత్రం గ్రేస్ తగ్గలేదు. కుర్ర హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి తరచుగా తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. అప్పుడప్పుడు అరుదైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. తన బాల్యానికి సంబంధించిన విషయాలతో పాటు చదువు, సినిమాలకు సంబంధించి ఎవరికీ తెలియని విషయాలను చెప్తుంటారు. తాజాగా చిరు ఓ రేర్ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటో వెనుకున్న కథ ఏంటో వివరించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, అదే నన్ను కాపాడింది
ABP సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న సాయి దుర్గ తేజ్ కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. తాను ఈ రోజు ప్రాణాలతో బతికి ఉన్నాననంటే దానికి కారణం హెల్మెట్ అన్నారు. బైక్ స్టార్ట్ చేశారంటే తలకు హెల్మెట్ ఉండేలా చూసుకోవాలన్నారు. “మీ అందరికీ నమస్కరించి చెప్తున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను. లేడీస్, కెమెరా మెన్ అందరూ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ నా జీవితాన్ని కాపాడింది. నా జీవితాన్ని తిరిగి ఇచ్చింది. నా తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని భాషల్లో చెప్తున్నాను. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ప్రాణాలు కాపాడుకోండి” అని కోరారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘స్పైడర్ మాన్ 4‘ వచ్చేస్తోంది
మార్కెల్ సినిమాటిక్ యూనివర్స్(MCU) టామ్ హాలండ్ నటించిన ‘స్పైడర్ మ్యాన్ 4‘ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ సినిమాలో టామ్ హాలండ్ ఉంటారా? లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. చివరకు అవన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. టామ్ హాలండ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని సోనీ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘స్పైడర్ మ్యాన్‘ సిరీస్‌ లోని నాల్గవ చిత్రం జూలై 24, 2026న థియేటర్లలో రాబోతున్నట్లు తెలిపింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

జ్యోతికతో సినిమా, సిగ్గు పడుతూ సూర్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య, జ్యోతిక. తమిళ సినిమా పరిశ్రమలో ఈ జంటకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. పెళ్లికి ముందుకు ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. 1999లో ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ సినిమాతో తొలిసారి జంటగా ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పలు  సినిమాల్లో నటించారు.  చివరిగా 2006లో ‘సిల్లును ఒరు కాదల్’ చిత్రంలో కనిపించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి ఓపాప, ఓ బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు పలు సినిమాల్లో నటించినా, కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరు  జంటగా ఓ సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే, సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Anantapuram News: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
Indiramma Houses APP: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి
CM Chandrababu: '1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
'1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సౌత్‌పై ఇంత చిన్న చూపా మోదీజీ, ఏబీపీ సదర్న్ రైజింగ్ ఈవెంట్‌లో సీఎం రేవంత్నేను చాలా ప్రాక్టికల్, కొంచెం సెంటిమెంటల్ కూడా - నటి గౌతమిరేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనంపర్ఫెక్ట్‌గా పాట పాడేవాళ్లు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు - సింగర్ శిల్పా రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహం వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ - జాతీయంగా బీజేపీని ఢీకొడుతున్నారా ?
Anantapuram News: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం - ఆరుగురు మృతి
Indiramma Houses APP: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ రెడీ: మంత్రి పొంగులేటి
CM Chandrababu: '1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
'1995 సీఎంను కాదు 2014 సీఎంనే' - టీడీపీ రాజకీయ వర్శిటీ అన్న సీఎం చంద్రబాబు
IND Vs NZ 2nd Test: 12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్!
12 ఏళ్ల తర్వాత - సొంత గడ్డపై టీమిండియా చిత్తు - చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్!
Telangana News: తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన - డీజీపీ సీరియస్
తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన - డీజీపీ సీరియస్
Laknavaram Lake Photos: ఫారిన్ ట్రిప్ వెళ్లలేకపోతున్నారా? మంచి టూరిజం స్పాట్ అందాల లక్నవరం ట్రిప్ ప్లాన్ చేయండి
ఫారిన్ ట్రిప్ వెళ్లలేకపోతున్నారా? మంచి టూరిజం స్పాట్ అందాల లక్నవరం ట్రిప్ ప్లాన్ చేయండి
YS Sharmila: జగన్ కోసం ఎంతో  చేశా -  ఇంత అన్యాయం చేస్తారా ? కంట తడి పెట్టుకున్న షర్మిల
జగన్ కోసం ఎంతో చేశా - ఇంత అన్యాయం చేస్తారా ? కంట తడి పెట్టుకున్న షర్మిల
Embed widget