Sai Durga Tej: ఆ హాలీవుడ్ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో - ‘SDT18’ గురించి అసలు విషయం చెప్పిన సాయి దుర్గ తేజ్!
తన తాజా చిత్రం ‘SDT18’ గురించి సాయి దుర్గ తేజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందన్నారు.
Sai Durga Tej About ‘SDT18’: కెరీర్ తొలి నాళ్లలో చిన్న సినిమాలు చేసిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ భారీ చిత్రల్లో నటిస్తున్నారు. మరీ ముఖ్యంగా యాక్సిడెంట్ తర్వాత వచ్చిన రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ‘విరూపాక్ష’ ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించగా, ‘బ్రో’ ఫర్వాలేదు అనిపించింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘SDT18’ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. రోహిత్ కేపీ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. “ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే” అనే క్యాప్షన్ తో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే, మూవీ భారీ స్థాయిలో తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది. కండలు పెంచిన దేహంతో సాయి దుర్గ తేజ్ ఆకట్టుకుంటున్నాడు. పీరియాడికల్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు అర్థం అవుతోంది. ఈ మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
బాలీవుడ్ మూవీ స్ఫూర్తితో..
ఇక తాజాగా ABP సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న సాయి దుర్గ తేజ్ ‘SDT18’ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు తనలో చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుందన్నారు. తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు వెల్లడించారు. జాక్ స్నైడర్ ఎపిక్ మూవీ 300 నుంచి ప్రేరణ పొంది ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు "‘SDT18’ నా కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా హాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘300’ నుంచి ప్రేరణ పొంది చేస్తున్నాం. తెలుగు ప్రజలు గర్వించేలా ఈ సినిమా ఉండబోతోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని మరో లెవల్ కు తీసుకుపోతుంది” అని చెప్పుకొచ్చారు.
వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు..
ఇక ‘SDT18’ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘హనుమాన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. దీపావళి సందర్భంగా టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: జ్యోతికతో సినిమా, సిగ్గు పడుతూ సూర్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?