అన్వేషించండి

AP Land Scam: రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చిక్కుల్లో జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి

Vijayawada Land Scam | ఏపీలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్ వెలుగు చేసింది. వైఎస్ జగన్, భారతీ రెడ్డి సన్నిహితులు అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపణలున్నాయి.

Land Scam allegations Against Rithu Chowdary | విజయవాడ: వైసీపీ హయాంలో ఏపీలో 600 కోట్లకు పైగా జరిగిన ల్యాండ్ స్కామ్ సంచలనంగా మారింది. గత 12 నెలలుగా ఏసీబీ నుంచి తప్పించుకుని తిరుగుతున్న సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ ను పోలీసుల అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గతంలో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రారుగా ధర్మ సింగ్ పనిచేశారు. వందల కోట్ల భూములను చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీదకు బలవంతంగా రిజిస్ట్రేషన్ చేపించారని ధర్మ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయితే ఎవరు బెదిరించి ఆ స్థలాలను శ్రీకాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేపించారన్న కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

జగన్, భారతీ రెడ్డి సన్నిహితులు అని ధర్మ సింగ్ ఆరోపణలు 

సబ్ రిజిస్ట్రార్ సింగ్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునిల్, జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ దందా చేశారని, శ్రీకాంత్ పేరిట ఆయన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ ఆరోపించారు. వైసీపీ హయాంలో భారతీరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ రెచ్చిపోయి అక్రమ రిజిస్ట్రేషన్లు చేపించుకున్నారని సంలచన విషయాలు కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్కా అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ధర్మ సింగ్ లేఖలో పేర్కొన్నారు. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారు. తన కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీల పేరుతో వేధించారని రిటైర్డ్ అధికారి ఆరోపించారు. పరారీలో ఉన్న ధర్మ సింగ్‌ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారని సమాచారం. 

ఎవరీ రీతూ చౌదరి..
బుల్లితెర నటి రీతూ చౌదరి, జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యారు. అంతకుముందు ప్రదీప్ మాచిరాజు పెళ్లిచూపులు కార్యక్రమం ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫారిన్ టూర్ల ఫొటోలను షేర్ చేస్తుంటారు. అయితే రూ. 600 కోట్ల ల్యాండ్ స్కాంలో రీతూ చౌదరి ఇరుక్కున్నారు. చీమకుర్తి శ్రీకాంత్ భార్య రీతూ చౌదరి పేరిట సైతం అక్రమ ఆస్తులున్నాయని ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ చెబుతున్నారు. ఏపీలో ల్యాండ్ మాఫియాలో రీతూ చౌదరి హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో నటీనటలు షాకవుతున్నారు. 

ఇబ్రహీంపట్నం, విజయవాడలలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌లో శ్రీకాంత్, రీతూ చౌదరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కమెడియన్‌గా, బుల్లితెర నటిగా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరిపేరు ల్యాండ్ మాఫియా కేసులో రావడం సంచలనంగా మారింది. వీరి వెనుక వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని.. ఏసీబీ విచారణలో వాస్తవాలు  బయటకు రానున్నాయి.

Also Read: Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Embed widget