Rohit Sharma Clarity on Retirement | సిడ్నీ టెస్టులో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రోహిత్ శర్మ | ABP Desam
తన చుట్టూ, తన రిటైర్మెంట్ చుట్టూ నెలకొన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. సిడ్నీ టెస్టులో తనను తానుగా ఆడనని తప్పుకున్న రోహిత్ శర్మ..కెప్టెన్సీ బాధ్యతలను జస్ ప్రీత్ బుమ్రాకు అప్పగించాడు. సిడ్నీ టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో తక్కువ పరుగులకే అవుటైనా ఆస్ట్రేలియాను బాగానే ఇబ్బంది పెడుతున్నారు మన బౌలర్లు. సో అదలా ఉంచితే అసలు రోహిత్ సిడ్నీ టెస్టు తర్వాత రిటైర్ అయిపోతున్నాడా అనే ప్రశ్నకు తనే ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చేశాడు. కేవలం ఫామ్ లో లేనని పక్కన కూర్చున్నానని...రిటైర్మెంట్ ఆలోచనలు లేవని...తనెక్కడికి పారిపోవట్లేదని చెప్పాడు రోహిత్ శర్మ. క్రికెట్ అనే గేమ్ లో ఫామ్ లో ఉండటం..ఫామ్ లో లేకపోవటం లాంటివి మాత్రమే ఉంటాయన్న రోహిత్ శర్మ..సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు తను ఈ టెస్ట్ ఆడటం కరెక్ట్ కాదనిపించిందని చెప్పాడు. అదే విషయాన్ని గంభీర్ కి చెప్పానని...పెర్త్ టెస్టులో భారత్ గెలుపునకు ఏయే కారణలున్నాయో వాటినే మళ్లీ రిపీట్ చేయాలనిపించి ఆ డెసిషన్ తీసుకున్నానని చెప్పాడు. బేసిక్స్ మీద దృష్టిసారించి మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తానని రిటైర్ అయ్యే సమస్యే లేదని..ఇద్దరు పిల్లల తండ్రిగా తన డెసిషన్స్ చాలా మెచ్యురూటీతో ఉంటాయని క్లారిటీ ఇచ్చేశాడు రోహిత్ శర్మ.