Guntur Municipal Corporation: గుంటూరు వైసీపీ కార్పొరేటర్ల అనుచిత ప్రవర్తన - కౌన్సిల్ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన కమిషనర్
Guntur: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీ కార్పొరేటర్ల తీరు వివాదాస్పదం అయింది. వారి తీరుకు నిరసనగా కమిషనర్ పులి శ్రీనివాసులు బాయ్ కాట్ చేశారు.
YCP corporators behavior in Guntur Municipal Corporation has become controversy: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీ కార్పొరేటర్లు కమిషనర్ పులి శ్రీనివాసులతో తవ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తమాషాగా ఉందా అంటూ కార్పొరేటర్లు పదే పదే ఆయనను బెదిరించే ప్రయత్నం చేయడంతో ఆయన అసహనానికి గురయ్యారు. చేతిలో పుస్తకాలు విసిరివేసి సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. నగరానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కమిషనర్ చెబుతున్న విషయాన్ని పట్టించుకోకుండా కార్పొరేటర్లు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వైసీపీ కార్పొరేటర్లు కమీషనర్ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు మాట్లాడిన విధానంపై విసుగుచెందిన కమిషనర్ .. చేతిలో ఉన్న పుస్తకాలను విసిరేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్పొరేటర్లను కంట్రోల్ చేయడానికి.. మేయర్ మనోహర్ నాయుడు ప్రయత్నించలేదు. కమిషనర్ వెళ్లిపోయిన తర్వాత కౌన్సిల్ సమావేశాన్ని అరగంట సేపు వాయిదా వేశారు.
అజెండాలోని 32 ప్రశ్నకు అధికారులు సమాధానం ఇచ్చారు. నగరపాలక సంస్థ తరపున చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపు అంశంపై ఈ ప్రశ్న ఉంది. అలాగే కార్పొరేషన్ పరంగా ఖర్చు చేసే విధానాలపై కార్పొరేటర్లు వివరాలు అడిగారు. కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లులు ఆడిట్ అనంతరం కమిషనర్ సమక్షంలో బిల్లులు పద్ధతి ప్రకారం రుగుతాయని కమిషనర్ తెలిపారు. అలానే కార్పొరేషన్ పరంగా ఖర్చు చేసే బిల్లులు అది విధాన పరంగా నిర్ణయిస్తామని కమిషనర్ తెలిపారు.
దీనిపై డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు మైక్ తీసుకుని అనుచితంగా మాట్లాడారు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసిన వారు ఎవరని.. వాళ్లకు తాము ఎట్లా కనిపిస్తున్నామని ప్రశ్నించారు. తమాషాగా ఉందా అని బెదిరించిటనట్లుగా మాట్లాడారు. దీనిపై స్పందించిన కమిషనర్ పులి శ్రీనివాసులు గౌరవ సభలో అధికారులను తమాషాగా ఉందా అని ప్రశ్నించడం సమంజసం కాదన్నారు. పూర్తి వివరాలు కావాలన్నా ఓ స్ట్రక్చర్ ప్రకారం ఇస్తామన్నారు. అంతటితో తగ్గని డిప్యూటీ మేయర్ తమను ప్రజలు ఎన్నుకున్నారని కార్పొరేషన్ పరంగా జరిగిన ఖర్చులపై అడిగే అధికారం ఉందని వాదనకు దిగారు.
తర్వాత కూడా అధికారులను అవమానపరిచే విధంగా తమాషాగా ఉందా అంటూ కేకలు వేయడంపై కమిషనర్ అసంతృప్తికి గురయ్యారు. సభను బాయ్ కట్ చేస్తూ అర్ధాంతరంగా కమిషనర్ తో పాటు అధికార యంత్రాంగం అంతా వెళ్లిపోయారు. ఇప్పటివరకు అధికార, విపక్షాల మధ్య గొడవలతో అందరూ వెళ్లిపోయేవారు. అయితే ఈసారి అధికారులపై వైసీపీ విరుచుకుపడటంతో వారు వెళ్లిపోయారు.
డిప్యూటీ మేయర్ ఇటీవలే ఓ కేసులో పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన జైలుకు వెళ్లి వచ్చారు. ఆయనపై పలు కేసులు ఉన్నాయి. వైసీపీ హైకమాండ్ ఆయనను తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించింది.
Also Read: 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కియారా అద్వానీ డుమ్మా... ఆస్పత్రిలో ఉందా? అసలు కారణం ఏమిటంటే?