అన్వేషించండి

Samsung Galaxy S23 Ultra: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ ఆఫర్ - ఏకంగా సగం వరకు తగ్గింపు!

Samsung Galaxy S23 Ultra Price Drop: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ఇప్పుడు దీన్ని దాదాపు సగం ధరకే కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S23 Ultra Price Cut: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్‌ను ఈ నెలలో విడుదల చేయనుంది. జనవరి 22వ తేదీన జరగనున్న ఈవెంట్‌లో ఈ లైనప్‌ను లాంచ్ చేయనున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. అంతకుముందు కంపెనీ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ధరలను భారీగా తగ్గించింది. ఈ ఫోన్ అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే సరైన సమయం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాపై భారీ తగ్గింపు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 1.49 లక్షల ధరతో మార్కెట్లో లాంచ్ అయింది. అయితే ఇది అమెజాన్‌లో ఇప్పుడు రూ.79,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై అమెజాన్ దాదాపు 47 శాతం తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్‌తో పాటు నో కాస్ట్ ఈఎంఐ, అనేక బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అమెజాన్ ఈ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. 

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఇది శక్తివంతమైన పనితీరు, సులభమైన మల్టీ టాస్కింగ్ కోసం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది.

కెమెరా గురించి చెప్పాలంటే ఈ ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 10 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. లాంచ్ సమయంలో ఈ ఫోన్ కెమెరా సామర్థ్యాల గురించి చాలా ప్రశంసలు వచ్చాయి. ఈ కెమెరా సెటప్‌తో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఇప్పటికీ ఇతర కంపెనీల అనేక ఫ్లాగ్‌షిప్ మోడల్‌లతో పోటీపడుతోంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరసమైన ధరలో గొప్ప ఫీచర్లతో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశం అని చెప్పుకోవాలి. 2023లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడే ఐదు జనరేషన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్ ప్రకటించింది. దీన్ని బట్టి ఇంకో మూడు మేజర్ అప్‌డేట్లను ఈ ఫోన్ అందుకోనుంది. కాబట్టి ఇప్పట్లో ఈ ఫోన్ అవుట్ డేటెడ్ కూడా కాదన్న మాట.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

టాప్ హెడ్ లైన్స్

Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget