అన్వేషించండి

Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం

Human Metapneumovirus :Human Metapneumovirus : సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అనేక వీడియోలు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయని చూపుతున్నాయి.

Human Metapneumovirus : కరోనా మిగిల్చిన విషాదం, నష్టాన్ని మర్చిపోకముందే.. చైనాలో మరో వైరస్ వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది, ఇతర దేశాలకూ ఈ వైరస్ వ్యాప్తికి సంబంధించిన నివేదికల మధ్య, చలికాలంలో సంభవించే శ్వాసకోశ వ్యాధుల కేసులు గతేడాది కంటే ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయని చైనా తెలిపింది. విదేశీయులు బీజింగ్‌కు వెళ్లొచ్చని, ఎలాంటి ప్రమాదమూ, రిస్క్ లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. "ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయిలో ఉంటాయి. కానీ అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది చైనాలో ఇన్ఫ్లుఎంజా A, ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తక్కువ స్థాయిలో వ్యాప్తి చెందాయి" అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. "చైనాలోని పౌరులు, విదేశీయుల ఆరోగ్యం గురించి చైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. చైనాలో ప్రయాణించడం సురక్షితమే" అని తెలిపారుొ.

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు

రీసెంట్ గా చైనాలో వెలుగులోకి వచ్చిన హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) అనే వైరస్.. ఇప్పుడు ఇతర దేశాలనూ వణికిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ వైరస్ కు సంబంధించిన పోస్టులు, వైరల్ అయ్యాయి. అనేక వీడియోల్లో ఆస్పత్రులు పేషెంట్స్ తో కిక్కిరిసినట్టు కనిపించాయి. ముఖానికి మాస్క్ లతో జనాలు కుప్పలు కుప్పలుగా కనిపించాయి. ఇవి నెటిజన్లతో పాటు ఇతరులకూ భయాందోళనలకు గురిచేశాయి, ఆల్రెడీ కొవిడ్ తో నానా అవస్థలు పడిన జనం... మళ్లీ ఆ రోజులు వస్తాయా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో కోల్పోయిన తమ బంధువులు, స్నేహితులను తలచుకుని.. లాక్ డౌన్ వంటి పరిస్థితుల్ని తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్రంగా ఉన్నది నిజమే.. కానీ భయపడాల్సిన అవసరం లేదు

ఇక శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధుల నివారణ,  నియంత్రణకు సంబంధించి నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా జారీ చేసిన మార్గదర్శకాలను కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రస్తావించింది. చైనాలో మెటాప్న్యూమోవైరస్ వ్యాప్తి గురించి ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్ సమాచారాన్ని అందించారు. ఇది తీవ్రంగా ఉన్నప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. "ఇది పెద్ద ఆందోళనకు కారణమని మేం నమ్మం. ఎందుకంటే ఇది జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాసకోశ వైరస్. కొన్ని సందర్భాల్లో, ఫ్లూ లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ లక్షణాలు కనిపించవచ్చు" అని డాక్టర్ గోయల్ వివరించారు. "కానీ అందరూ అనుకుంటున్నట్టు ఇది అంత అత్యంత తీవ్రమైన వ్యాధి, అనారోగ్యం కాదు. ఎవరూ దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చలికాలంలో సాధారణంగానే శ్వాసకోశ వైరస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఇందుకు కావల్సిన పడకలు, సౌకర్యాలు చేశాం. దీనికి నిర్దిష్ట యాంటీవైరల్ మందులు అవసరం లేదు. ఈ వైరస్‌కు నిర్దిష్ట మందులు కూడా లేవు" అని అతుల్ చెప్పారు.

Also Read : China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam Airport Service Ends: కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
కొన్ని గంటల్లో ముగియనున్న విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఇక నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget