Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడుతో ఒకరి మృతి - 10 మందికి తీవ్ర గాయాలు
Explosion in Yadadri District | యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
Explosion in Peddakandukur in Yadadri district | యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఒక కార్మికుడు మృతిచెందగా.. మరో 10 మంది కార్మికులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించడంతో కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రాణ భయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పేలుడు జరిగిన వెంటనే సైరన్ మోగించి మిగతా కార్మికులను అప్రమత్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని దూలపల్లిలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ గోదాంలో భారీగా మంటలు ఎగిసి పడి.. నిమిషాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. పొగలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం సంభవించడంతో దూలపల్లిలో కొంత సమయం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
Also Read: Insta Love Affair: యువకుడితో ఇన్‌స్టాలో యువతి లవ్, రెండు కుటుంబాల మధ్య ఘర్షణ - ట్విస్ట్ ఏంటంటే