Vijayawada Traffic Diversions: ఈ 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, హైందవ శంఖారావ సభకు వచ్చేవాళ్ళ రూట్ ఇదే!
Vijayawada News | విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ఆదివారం నాడు హైందవ శంఖారావం సభ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు జనవరి 5న విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Haindava sankharava sabha in vijayawada | విజయవాడలో ఆదివారం " హైందవ సంఖరావం " పేరుతో భారీ సభను ఏర్పాటు చేసింది విశ్వ హిందూ పరిషత్ హిందూ దేవాలయాల పరిరక్షణ, హైందవ దేవాలయ నిర్వహణ ధర్మ సంఘాల చేతుల్లోనే ఉండడం వంటి డిమాండ్లతో నిర్వహిస్తున్న ఈ సభ కోసం ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని కేసర పల్లెలో జరుగుతున్న సభ కోసం పోలీసులు ట్రాఫిక్ ని మళ్ళించారు. ఆదివారం విజయవాడలో పోలీస్ ఆంక్షలు ఈ విధంగా ఉండబోతున్నాయి.
హైందవ శంఖారావం "" సభ వలన ఉదయం 05.00 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు గన్నవరం నుండి రామవరప్పాడు వరకు ట్రాఫిక్ పూర్తిగా ఆపివేయబడును.
హనుమాన్ జంక్షన్ వైపు నుండి వచ్చు అన్ని బస్ లు చిన ఆవుటపల్లి "" పిన్నమనేని సిద్ధార్థ "" హాస్పిటల్ ఎదురుగా కొత్త బైపాస్ రోడ్డు లో వెళ్లి *నున్న* గ్రామం వద్ద క్రిందికి దిగి పాయకాపురం , అజిత్ సింగ్ నగర్ మీదుగా విజయవాడ బస్టాండ్ కు వెళ్లాల్సి ఉంటుంది .
మరల డౌన్ లో కూడా అదే రూట్ లో రావలెను.
హనుమాన్ జంక్షన్ -- మార్కెట్ సిటీ బస్సులు*
గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నుండి B B గూడెం వద్ద క్రొత్త బైపాస్ రోడ్డు ఎక్కి ముస్తాబాద్ వద్ద క్రిందకు దిగి ముస్తాబాద్ గ్రామం , ఇన్నర్ రింగ్ రోడ్ నుండి రామవరప్పాడు రింగ్ , గుణదల మీదుగా కా" మార్కెట్ వెళ్లాల్సి ఉంటుంది.
1) విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్ళు వాహనాలు దారి మళ్లింపు: ( Kakinada District)
కాకినాడ జిల్లా కత్తిపూడి సెంటర్ నుండి వయా కాకినాడ యానం అమలాపురం రాజోలు నరసాపురం మచిలీపట్నం రేపల్లె బాపట్ల మీదుగా ఒంగోలు వెళ్ళవలెను
2) చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళు వాహనాలు (Parkasam District)
ఒంగోలు వద్దనుండి- త్రోవగుంట-బాపట్ల-రేపల్లి-అవనిగడ్డ-మచిలీపట్నం- లోస్రా బ్రిడ్జి-నరసాపురం-అమలాపురం-కాకినాడ-కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను
3) చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళు వాహనాలు (Guntur District)
బడంపాడు క్రాస్ రోడ్ నుండి-తెనాలి-పులిగడ్డ-మచిలీపట్నం-లోస్రా బ్రిడ్జ్-నరసాపురం-అమలాపురం-కాకినాడ-కత్తిపూడి మీదగా విశాఖపట్నం వైపు వెళ్ళవలెను
4) విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు: ( East Godavari distrit)
తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు వైజాగ్ మీదుగా వయా గామన్ బ్రిడ్జి దేవరపల్లి గోపాలపురం జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట సత్తుపల్లి ఖమ్మం మీదుగా సూర్యాపేట వెళ్ళవలెను
5) విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళు వాహనాలు ( Eluru District)
భీమడోలు-ద్వారకాతిరుమల-కామవరపుకోట-చింతలపూడి-ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళవలెను
ఏలూరు బైపాస్-జంగారెడ్డిగూడెం-అశ్వరావుపేట-ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను
ఏలూరు బైపాస్- చింతలపూడి- సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్ళవలెను
6) విశాఖపట్నం నుంచి హైదరాబాదు వెళ్ళు వాహనాలు (Krishna District)
హనుమాన్ జంక్షన్-నూజివీడు-మైలవరం-ఇబ్రహీంపట్నం-నందిగామ మీదుగా హైదరాబాద్ వెళ్ళవచ్చు
7) హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్ళు వాహనాలు ( NTR District)
నందిగామ-మధిర-వైరా-సత్తుపల్లి- అశ్వారావుపేట -జంగారెడ్డిగూడెం-దేవరపల్లి-గామన్ బ్రిడ్జి మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
ఇబ్రహీంపట్నం-మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్-ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి
రామవరప్పాడు రింగ్ - నున్న- పాములు కాలువ - వెలగలేరు- జి.కొండూరు-మైలవరం-నూజివీడు-హనుమాన్ జంక్షన్-ఏలూరు మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లొచ్చు .
విజయవాడ-ఎనికెపాడు 100 అడుగుల రోడ్డు-తాడిగడప-కంకిపాడు-పామర్రు-గుడివాడ-భీమవరం మీదుగా విశాఖపట్నం వైపు వెళ్ళాలి .
8) విజయవాడ ఎయిర్పోర్ట్ కు వెళ్లే వారు రామవరప్పాడు ఫ్లైఓవర్ మీదుగా ఆంధ్రజ్యోతి, ముస్తాబాద్ సూరంపల్లి అండర్ పాస్ ద్వారా కొత్త బైపాస్ రోడ్డుపై నుండి బీబీ గూడెం అండర్ పాస్ ద్వారా గన్నవరం చైతన్య స్కూల్ జంక్షన్ వద్ద ఎన్ హెచ్ 16 కు వచ్చి అక్కడినుండి విజయవాడ ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది (సంబంధిత పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి).
Also Read: AP Land Scam: ఏపీలో రూ.600 కోట్ల ల్యాండ్ స్కామ్- చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిలపై సంచలన ఆరోపణలు