Dhruv Jurel Century for India A | సెంచరీలతో చెలరేగిన ధ్రువ్ జురెల్
భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ మధ్య రెండో ఆన్ ఆఫిసియల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో యంగ్ వికెట్ కీపర్- బ్యాట్స్‌మెన్ ధ్రువ్ జురెల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే ఏకంగా రెండు సెంచరీలు చేసి సెలెక్టర్ల మైండ్ లో పడ్డాడు. ఇక ఈ పెర్ఫార్మన్స్ ని చూసి రాబోయే సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ఖచ్చితంగా ధ్రువ్ జురెల్ ని టీమ్ లో సెలక్ట్ చేస్తారని అంటున్నారు విశ్లేషకులు.
ఈ టెస్ట్ మ్యాచ్ లో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. అప్పుడు వచ్చిన ధ్రువ్ జురెల్ 175 బాల్స్ లో 132 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే భారత్ ఏ 255 పరుగుల స్కోరును చేరుకోగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఫామ్‌ను కొనసాగించిన ఈ యంగ్ ప్లేయర్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ నమోదు చేశాడు. దాంతో భారత్ స్కోర్ 300 మార్కును దాటింది.
ఇక సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ధ్రువ్ జురెల్ ని సెలెక్ట్ చేయాలని అంటున్నారు ఫ్యాన్స్. టీమ్ ఇండియా కష్టాలో ఉన్నప్పుడు భారీ స్కోర్ చేసి పరువు కాపాడిన ధ్రువ్ జురెల్ ... బ్యాట్స్మన్ గానే కాకుండా వికెట్ కీపర్ గా కూడా బాగా రాణిస్తున్నాడు.





















