Abhishek Sharma World Record in T20 | అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు !
ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్ లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ లో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.
గత సంవత్సరం జూలైలో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఒక ఏడాలోనే చాలా సాధించాడు. అభిషేక్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో ఉన్నాడు. తన్ను ఆడిన టీ20ల్లో 1000 పరుగులు 528 బంతుల్లో పూర్తి చేశాడు. ఇంతకు ముందు రెండవ స్థానంలో ఉన్న సూర్యకుమార్ 573 బంతుల్లో వెయ్యి పరుగులు చేశాడు.
అతి తక్కువ ఇన్నింగ్స్ లలో 1000 రన్స్ చేసిన రికార్డులో కింగ్ విరాట్ కోహ్లీ కంటే వెనుకంజలో ఉన్నాడు ఈ యంగ్ ప్లేయర్. కోహ్లీ 27 ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ 28 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు.





















