Jubilee Hills Politics: కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లను కొంటుందని, బీఆర్ ఎస్ ను ఓటర్లు నమ్మే ప్రశక్తే లేదని, బీజేపిదే గెలుపంటున్న ఎమ్మెల్యే అభ్యర్ది దీపక్ రెడ్డితో ఏబిపి దేశం ప్రత్యేకం..

Lankala Deepak Reddy | గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం తనకు ఉందని, ప్రజల్లో బీజేపీకి ఆధరణ పెరుగుతోందని పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారని, బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ కాదని.. బీజేపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
ఏబీపీ దేశం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం ఎలా సాగింది. కమలంపై ఓటర్లలో స్పందన ఎలా ఉంది..?
లంకల దీపక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ది..
నేను గత ఎన్నికల్లో సైతం ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి బీజేపి ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీచేశాను. ఆ ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలకు ఏ మాత్రం పొంతన లేదు. ఓటర్లు మమ్మల్ని ఇళ్లోకి పిలిచిమరీ , బొట్టు పెట్టి ఈసారి మీకు ఓటేస్తామని చెబుతున్నారు. గత ఎమ్మెల్యే గోపీనాధ్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీ నాయకులను బెదిరించేవాడు. మాపై తప్పుడు కేసులు పెట్టేవాడు.గతంలో కిషన్ రెడ్డి మీటింగ్ పెడితే, మీరెందుకు వెళ్లారంటూ బెదిరించేవారు.
ఏబీపీ దేశం..
మీరు ఆరోపిస్తున్నట్లు మాగంటి గోపీనాధ్ అంతలా ఇక్కడ రౌడీయిజం చేసేవారా.. ఇప్పుడు కావాలనే మీరు సానుభూతి కోసం ఆరోపిస్తున్నారా..?
లంకల దీపక్ రెడ్డి..
నాకు గోపీనాథ్ పై తప్పుుడు ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే జనంలోకి వెళ్లి అడగొచ్చు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లి అడిగినా గోపీనాధ్ అరాచకాలు చెబుతారు. సర్దార్ అనే బాధితుడు గత ప్రభుత్వంలో మాగంటి గోపీనాధ్ వేధింపులు భరింలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రభుత్వంతో చెప్పుకున్నా ఫలితంలేదు.
ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఈ రెండు పార్టీలు ఎంతకైనా దిగజారుతాయి..
— Lankala Deepak Reddy (@LDR4BJP) November 9, 2025
ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే అజారుద్దీన్ కి మంత్రిపదవి ఎందుకు ఇచ్చారు ? ఒక లక్ష మంది ఎకమ్మైనప్పుడు మూడు లక్షలు ఉన్న హిందువులు ఎందుకు ఏకం కావద్దని ఆలోచనలో ఉన్నారు హిందూ సమాజం. ఈ ఉపఎన్నికల్లో బీజేపీని అద్భుతమైన మెజారిటీతో… pic.twitter.com/el7QGdRTSu
ఏబీపీ దేశం..
మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ది, భర్త మరణించిన సానుభూతి ఇలా గోపీనాధ్ భార్య సునీతకు కలిసొచ్చే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలా ఈ రెండు పార్టీలను మీరు బీజేపి అభ్యర్దిగా ఎలా ఓడించగలరు..?
లంకల దీపక్ రెడ్డి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ్ం చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ది చెందితే, ఒక్క జూబ్లీహిల్స్ లో మాత్రం కనీసం రోడ్లు గుంతలు, మురుగునీటితో నిత్యం వాహనాలుసైతం తిరగలేని దుస్దితి ఇక్కడ ఉంది. డ్రైనేజ్ నీళ్లు రోడ్లపై నిత్యం ప్రవహిస్తూనే ఉంటాయి. ఎంఐఎం నేతలు ఇక్కడ అభివృద్దిని కావాలనే అడ్డుకుంటున్నారు. అభివృద్ది చేస్తే ఎంఐఎం కు ఓట్లు పడవని , ఇక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ఎంఐఎం నేతలు జూబ్లీహిల్స్ ను అభివృద్ది చేయనివ్వరు.
ఏబీపీ దేశం..
2014 ఎన్నికల నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం బలపర్చిన అభ్యర్దికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏఐఎం ప్రాభల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపి అభ్యర్దిగా మీరు ఎలా అధిగమించగలరు..?
లంకల దీపక్ రెడ్డి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం నేతలు ఇక్కడ ఓట్లను అమ్ముకుంటారు. 2014 ఎన్నికల్లో రెండో స్దానంలో వచ్చిన అభ్యర్ది, ఆ తరువాత ఎందుకు ఆ పార్టీ నుండి పోటీ చేయలేదో చెప్పాలి. 2023 ఎన్నికల్లో ఓ డమ్మీ అభ్యర్దిని ఇక్కడ నిలబెట్టిన ఎంఐఎం, ఆ తరువాత ఆ అభ్యర్దిని బూత్ ఏజెంట్ గా మార్చేసింది. వాళ్ల వద్ద ఓ తూకం ఉంటుంది. ఏ పార్టీ ఎక్కవ డబ్బులిస్తే, తూకం అటు తూగుతుంది. ఓట్లు ఆ పార్టీకే వేయాలని అమ్ముకోవడం వాళ్లకు అలవాటు.ఈ ఎన్నికల్లో ఏఐఎంకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారు.ఇప్పుడు బీజేపి వెంట మైనార్టీ సోదరులు వస్తున్నారు.ఈసారి మైనర్టీ ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఓట్లు పడతాయి. ఎంఐఎం నేతలు మతాల పేరుతో మైనార్టీ ఓటర్లను రెచ్చగొట్టకపోతే ,వాళ్లు ఎప్పటికీ బీజేపీతోనే ఉంటారు.
ఏబీపీ దేశం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీసీ ఓట్ల ప్రాభల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తరువాత స్దానంలో మైనర్టీలే కీలకం. కాంగ్రెస్ ఇక్కడ బీసీ అభ్యర్దినే పోటీలో నిలబెట్టింది.ఓ మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్ బీజేపి ఎలా తట్టుకుంటుంది.?
లంకల దీపక్ రెడ్డి..
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై అంత ప్రేమ ఉంటే, 42శాతం బీసీ రిజర్వేషన్లలో 10శాతం మైనార్టీలను ఎందుకు కలిపారు. ఇది బీసీలకు అన్యాయం చేయడమే. దేశంలో ప్రధాని బీసీనేత, తెలంగాణలో అధికారంలోకి వస్తే బీజేపి బీసీనే సీఎం చేస్తుంది. కాంగ్రెస్ కు బీసీలపై అంత ప్రేమ ఉంటే, రేవంత్ రెడ్డిని సీఎంగా తొలగించి, బీసీలకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వొచ్చు. కావాలనే ఇదంతా ఎన్నికల కోసం ఆడుతున్న డ్రామా. ఓడిపోయే అభ్యర్దికే కాంగ్రెస్ సీటు ఇచ్చింది. ఇది ఎటో పోతోందని మైనార్టీకి మంత్రి పదవి ఎరవేసింది. అజారుద్దీన్ పై అనేక ఆరోపణలున్నాయి. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరో పార్టీలోకి వెళతానని బెదిరించడంతోనే ఇలా మంత్రి పదవి డ్రామాలు ఆడుతున్నారు.
ఏబీపీ దేశం..
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి ఇక్కడ బీజేపిని గెలిపించని ప్రజలు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎందుకు గెలిపించాలంటే , మీరేమంటారు..?
లంకల దీపక్ రెడ్డి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకే ప్రముఖులు,దనవంతులు ఉండే ప్రాంతం. కానీ ఇక్కడ ఎక్కువ శాతం నివసించేది రోజుకూలీలే, ఉపాధి కార్మికులే, పేద మధ్యతరగతి కుటుంబాలే ఇక్కడ ఎక్కువ. రోజూ పనిలేకపోతే ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక్కడ ప్రజలు. ఎంపీ నిధుల నుండి కిషన్ రెడ్డి ఇక్కడ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారు. ప్రజల సమస్యలు తీర్చారు. బీజేపి గెలిపిస్తే ఇక్కడ ఎందుకు అభివృద్ది జరగదో అధికార పార్టీని ప్రశ్నిస్తాం. అభివృద్ది చేసి చూపిస్తాం. కార్యకర్తలగానే ఇంతలా పోరాడుతున్నామంటే, ఎమ్మెల్యేగా గెలిస్తే అంసెబ్లీలో అధికార పార్టీని నిలదీస్తాం. జూబ్లీహిల్స్ ను అభివృద్దిలో ముందు వరుసలో నిలబెడతాం.




















