అన్వేషించండి

Suriya-Jyothika: జ్యోతికతో సినిమా, సిగ్గు పడుతూ సూర్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?

పెళ్లికి ముందు పలు సినిమాల్లో కలిసి నటించిన సూర్య, జ్యోతిక.. పెళ్లి తర్వాత ఒక్క మూవీ కూడా చేయలేదు. ఇద్దరు త్వరలో సినిమా చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Suriya-Jyothika Movie: దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ కపుల్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య, జ్యోతిక. తమిళ సినిమా పరిశ్రమలో ఈ జంటకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. పెళ్లికి ముందుకు ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. 1999లో ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’ సినిమాతో తొలిసారి జంటగా ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత పలు  సినిమాల్లో నటించారు.  చివరిగా 2006లో ‘సిల్లును ఒరు కాదల్’ చిత్రంలో కనిపించారు. అదే సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి ఓపాప, ఓ బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు పలు సినిమాల్లో నటించినా, కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. వీరిద్దరు  జంటగా ఓ సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అడిగితే, సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కథ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాం- సూర్య

‘కంగువా’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సూర్య, తన భార్య జ్యోతికతో కలిసి నటించడం గురించి కీలక విషయాలు చెప్పారు. కథ డిమాండ్ చేస్తే తప్పకుండా కలిసి నటిస్తామన్నారు. “నా భార్యతో కలిసి నటించడం నాకూ చాలా ఇష్టంగానే ఉంది. తుది నిర్ణయం అనేది దర్శక నిర్మాతల మీద ఆధారపడి ఉంటుంది. కథ డిమాండ్ చేస్తే తప్పకుండా కలిసి నటిస్తాం. సినిమా అనేది ఆర్గానిక్ వేలో ఉండాలి. కావాలని నటించేలా చేసినట్లు ఉండకూడదు. రీమేక్ సినిమానా? కొత్త కథా? అనేది ముఖ్యం కాదు. ఇద్దరికి సరిపోయే కథ అయితే చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు” అని సూర్య చెప్పుకొచ్చారు. నిజానికి గత కొద్ది కాలంగా జ్యోతిక, సూర్య కలిసి సినిమా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ మహిళా దర్శకురాలు వీరి సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ అదే నిజం అయితే, పెళ్లి తర్వాత ఈ దంపతులు కలిసి చేసే తొలి సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  

నవంబర్ 14న ‘కంగువా’ సినిమా విడుదల

తాజాగా సూర్య హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువా’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన అద్భుతమైన నటనతో సూర్య మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితం పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన్నట్లు ఇప్పటికే సూర్య చెప్పుకొచ్చారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సుమారు 35 భాషల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదలకాబోతోంది.    

Read Also: పగటిపూట 3 గంటలకే చీకటి పడే వింత ఊరు... క్యూరియాసిటీని పెంచేస్తోన్న 'క' ట్రైలర్ 

టాప్ హెడ్ లైన్స్

Salman Khan: చొక్కా విప్పిన సల్మాన్... ట్రోలర్లకు కౌంటర్... కత్రినాకు సపోర్ట్
చొక్కా విప్పిన సల్మాన్... ట్రోలర్లకు కౌంటర్... కత్రినాకు సపోర్ట్
Chiranjeevi: థియేటర్ బిజినెస్‌లో మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ఏర్పాటుకు రెడీ
థియేటర్ బిజినెస్‌లో మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ... హైదరాబాద్‌లో వరల్డ్ లార్జెస్ట్ స్క్రీన్ ఏర్పాటుకు రెడీ
Manasa Sharma: స్టేజిపై ఏడ్చేసిన లేడీ డైరెక్టర్... మహేష్ కోసం మానస ఎమోషనల్
స్టేజిపై ఏడ్చేసిన లేడీ డైరెక్టర్... మహేష్ కోసం మానస ఎమోషనల్
Raaka Glimpse: అల్లు అర్జున్ 'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్? అసలు మ్యాటర్ ఏమిటంటే?
అల్లు అర్జున్ 'రాకా' గ్లింప్స్‌లో హాలీవుడ్ స్టార్? అసలు మ్యాటర్ ఏమిటంటే?

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Team India Selection Controversy:  ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
ఆ ప్లేయ‌ర్ కు టీమిండియా క్యాప్ ఇవ్వడంపై శ్రీకాంత్ ఫైర్, ఆ పేస‌ర్ ను బెంచ్‌పై కూర్చోబెట్టడం అన్యాయమంటూ విమ‌ర్శ‌లు
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
Bigg Boss Season 10 Today Sep 19th Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: మానిప్యులేటర్ ఎవరు? పపెట్‌ ఎవరు? ఇంటి మొత్తానికి పనిష్మెంట్స్! ఆ ఇద్దరూ ఆటకి దూరం!
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Embed widget