అన్వేషించండి

Crime News: తెలంగాణలో మరో ఘోరం - బాలికల హాస్టల్ బాత్రూంలో కెమెరాల కలకలం, మహబూబ్‌నగర్‌లో విద్యార్థినుల ఆందోళన

Mahabubnagar: మహబూబ్‌నగర్ పాలిటెక్నిక్ కళాశాలలోని గర్ల్స్ హాస్టల్‌లో బాత్రూం వద్ద వీడియో రికార్డింగ్ కలకలం రేపింది. మొబైల్‌లో వీడియో రికార్డ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

Video Recording In Girls Hostel Bathroom In Mahabubnagar: తెలంగాణలో మరో ఘోరం వెలుగుచూసింది. ఇటీవలే సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటన మరువక ముందే మరో ఘటన కలకలం రేపింది. మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలోని గర్ల్స్ హాస్టల్ వద్ద వీడియోల రికార్డింగ్ కలకలం రేపింది. హాస్టల్ బాత్రూం వద్ద ఓ యువకుడు వీడియో రికార్డింగ్ చేసినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. వాష్ రూం వద్ద మొబైల్‌లో కెమెరా ఆన్‌లో ఉంచి రికార్డ్ చేసినట్లు చెబుతున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. ఏబీవీపీ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థినులు నిరసన తెలపగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాక్‌లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చి సదరు విద్యార్థి ఇలా చేసినట్లు తెలుస్తోంది.

కాగా, ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని.. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలా జరిగిందని చెబుతున్నారు. తొలిసారి ఇలా జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, రాష్ట్రంలో వరుస ఘటనలతో హాస్టల్ విద్యార్థినులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు ఆకతాయిల్లో మార్పు రావడం లేదు. తమకు రక్షణ కల్పించాలని.. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యార్థినులు కోరుతున్నారు.

సీఎంఆర్ కాలేజీ ఘటన..

కాగా, ఇటీవలే హైదరాబాద్ శివారు మేడ్చల్ వద్ద సీఎంఆర్ఐటీ గర్ల్స్ హాస్టల్ వద్ద కూడా వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ ఆవరణలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ వద్దకు చేరుకున్న పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దర్యాప్తు ముమ్మరం చేశారు. హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వీరి వేలిముద్రలు సేకరించి.. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అటు, ఈ ఘటనలో కళాశాల యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించింది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా ఘటనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read: Allu Arjun News: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్, బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించి నేరుగా ఇంటికే

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Unique Mercantile Fraud: అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు.. 'యూనిక్' కంపెనీ ఎండీ రాజ్ కుమార్ అరెస్ట్
అధిక వడ్డీ, భూములు ఆశ చూపి వందల కోట్ల వసూలు.. ప్రజల సొమ్ముతో విలాసాలు
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget