అన్వేషించండి

CBSE 10వ తరగతి ఫలితాలు విడుదల.. DigiLockerలో మీ స్కోర్‌కార్డ్‌ను చెక్ చేసుకోండి

CBSE 10వ తరగతి సెకండ్ బోర్డు ఎగ్జామ్స్ 2026 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. చాలా మంది విద్యార్థులు రెండో ప్రయత్నంలో అధికంగా మార్కులు సాధించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • విద్యార్థులు డిజిలాకర్ ద్వారా డిజిటల్ పత్రాలు సులభంగా పొందవచ్చు.

CBSE class 10 Results | కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష (CBSE Board Exam Results 2026) ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన 6.8 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫలితాలు వచ్చేశాయి. సీబీఎస్ఈ బోర్డు ఫలితాల ప్రకటనతో పాటు స్కోర్‌కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌ను యాక్టివేట్ చేసింది. పదో తరగతి పరీక్షలకు హాజరైన సీబీఎస్ఈ విద్యార్థులు తమ ఫలితాలను https://results.digilocker.gov.in/cbse10thfinalresjul26X.html ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.

కొత్త విద్యా విధానం కింద రెండు పరీక్షలు 

CBSE శనివారం, జూలై 18, 2026న 10వ తరగతి రెండవ బోర్డు పరీక్ష ఫలితాలను ప్రకటించింది. కొత్త విద్యా విధానం 2020 కింద, ఈ సంవత్సరం తొలిసారిగా విద్యార్థులకు ఒకే విద్యా సంవత్సరంలో రెండుసార్లు బోర్డు పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. సీబీఎస్ఈ బోర్డు విధానం ప్రకారం, విద్యార్థుల తుది ఫలితాలను సిద్ధం చేయడానికి రెండు పరీక్షలలో (మెయిన్ ఎగ్జామ్, రెండవ పరీక్ష) వారి మెరుగైన పనితీరు అంటే బెస్ట్ స్కోర్ ఆధారంగా రిజల్ట్స్ పరిగణిస్తారు. పరీక్షకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు డిజిలాకర్ పోర్టల్‌లో తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలో 59.95% మంది విద్యార్థులు బెస్ట్ స్కోర్

సీబీఎస్‌ఈ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం రెండవ బోర్డు ఎగ్జామ్ కోసం మొత్తం 6,64,027 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 6,63,777 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వీరిలో 5,13,955 మంది విద్యార్థులు ప్రధాన పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన తర్వాత తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవడానికి మళ్లీ ఎగ్జామ్ రాశారు. బోర్డుకు ఈ ప్రయోగం సక్సెస్ అయింది.  ఎందుకంటే 3,08,095 మంది విద్యార్థులు ప్రధాన పరీక్షతో పోలిస్తే రెండోసారి రాసిన పరీక్షలో మార్కులను మెరుగు చేసుకున్నారు. 

పెరిగిన కంపార్ట్‌మెంట్ కేటగిరీ పాస్ శాతం 

సీబీఎస్ఈ రెండవ బోర్డు పరీక్షతో పాటు నిర్వహించిన కంపార్ట్‌మెంట్ పరీక్షలకు ఈసారి 1,49,822 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 78,503 మంది విద్యార్థులు సక్సెస్ అయ్యారు. ఈ సంవత్సరం కంపార్ట్‌మెంట్ కేటగిరీ మొత్తం పాస్ శాతం 52.40 శాతం నమోదైంది. గత సంవత్సరం 48.68 శాతంతో పోలిస్తే మెరుగైన రిజల్ట్ ఇది. ప్రధాన పరీక్ష, ఈ రెండవ బోర్డు పరీక్ష రెండింటి లెక్కలు కలిపి, 2026 సంవత్సరానికి 10వ తరగతి మొత్తం పాస్ శాతం 96.78 శాతానికి చేరుకుంది.

డిజిలాకర్, స్కూల్ నుండి డిజిటల్ పత్రాలు 

అన్ని అనుబంధ పాఠశాలలకు వారి రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీలకు విద్యార్థుల ఫలితాలు, డిజిటల్ సర్టిఫికెట్లు పంపుతామని CBSE స్పష్టం చేసింది. విదేశాలలో ఉన్న CBSE విద్యార్థులు కూడా డిజిలాకర్ ద్వారా తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈజీగా సర్టిఫికేట్‌లను పొందవచ్చు.

రెగ్యులర్ విద్యార్థులు.. క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లే విద్యార్థుల ఒరిజినల్ మార్క్‌షీట్‌లు, పాసింగ్ సర్టిఫికేట్‌లు వారి సంబంధిత స్కూల్ నుంచే పొందచ్చు. 

ప్రైవేట్ విద్యార్థులు.. ప్రైవేట్ అభ్యర్థులకు వారి డిజిటల్ పత్రాలు నేరుగా డిజిలాకర్‌లో అందుబాటులో ఉంచుతారు. 

ఢిల్లీ విద్యార్థులు: ఢిల్లీ తూర్పు, ఢిల్లీ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోకి వచ్చే ప్రైవేట్ విద్యార్థులు డిజిలాకర్‌తో పాటు తమ స్కూల్, కేటాయించిన పరీక్షా కేంద్రం నుండి కూడా డిజిటల్ సర్టిఫికెట్స్ పొందవచ్చు. 

Frequently Asked Questions

ప్రధాన పరీక్షతో పోలిస్తే రెండవ పరీక్షలో ఎంతమంది మార్కులు మెరుగుపరుచుకున్నారు?

రెండవ పరీక్ష రాసిన 5,13,955 మందిలో 3,08,095 మంది విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకున్నారు. ఇది మొత్తం విద్యార్థులలో 59.95% మందికి సమానం.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
ఉజ్జయినిలో షాహీ మసీదు కూల్చివేత వివాదం: షాహీ మసీదును ఎవరు నిర్మించారు, దాని చరిత్ర ఏంటి?
CM Vijay Gold Ring Scheme: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు గ్రాము బంగారపు ఉంగరం.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలకు గ్రాము బంగారపు ఉంగరం.. కొత్త పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు - తాడేపల్లి హుకుం.. క్షేత్రస్థాయిలో నైరాశ్యం! వైఎస్సార్‌సీపీలో రాజకీయ సంక్షోభం కనిపిస్తోందా?
Telangana Pending Bills Protests: భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
భట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు, ఉద్యోగుల రోజువారీ ధర్నాలు - తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందా?
Kalki Bhagavan Passes Away: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. నేడు తిరుపతి జిల్లాకు పార్థివదేహం తరలింపు
Athletics Gold Rush: ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
ట్రాక్ పై భారత మహిళల సంచలన పరుగు.. అథ్లెటిక్స్ లో ఏకైక పసిడితో అదిరిపోయే ముగింపు, ఆఫ్ సెంచ‌రీకి దాటిన భారత్ మెడల్స్ వేట
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Bowling Coach Reunion: చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
చెన్నై గూటికి ఆ జట్టు మాజీ పేసర్ .. జహీర్ ఖాన్ టీమ్‌లోకి బౌలింగ్ కోచ్ గా రీ ఎంట్రీ
Embed widget