అన్వేషించండి

CBSE Parenting Calendar 2026: సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల! 2026-27 విద్యా సంవత్సరంలో వచ్చే మార్పులు ఇవే! 

CBSE 2026-27 విద్యా సంవత్సరానికి కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌ విడుదల చేసింది. పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించడానికి, మెరుగైన ఫలితాల కోసంపాఠశాలలను, తల్లిదండ్రులను ఒకచోట చేర్చడమే దీని ఉద్దేశ్యం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీబీఎస్ఈ కొత్త పేరెంటింగ్ క్యాలెండర్ పిల్లల సమగ్ర వికాసానికి ప్రారంభించింది.
  • పిల్లల మానసిక, సామాజిక వికాసానికి తల్లిదండ్రుల భాగస్వామ్యం కోరుతుంది.
  • వైవిధ్య పిల్లల అవసరాలు, మారే విద్యా వాతావరణంపై దృష్టి సారించింది.
  • పాఠశాలలు, కుటుంబాల సహకారం పిల్లలకు మెరుగైన మద్దతునిస్తుంది.

CBSE Parenting Calendar 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొత్త 2026-27 విద్యా సంవత్సరానికి గాను పేరెంటింగ్ క్యాలెండర్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం లక్ష్యం కేవలం పిల్లల విద్యకే పరిమితం కాకుండా, వారి మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాన్ని బలోపేతం చేయడం. పిల్లల కోసం పాఠశాలలు, కుటుంబాలు కలిసి పనిచేసినప్పుడు, వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అభ్యసన అనుభవం మెరుగుపడుతుందని బోర్డు విశ్వసిస్తోంది.

సీబీఎస్ఈ ప్రకారం, పేరెంటింగ్ క్యాలెండర్‌ను 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభించారు. ఆ సమయంలో, ఈ కార్యక్రమానికి పాఠశాలలు, ఉపాధ్యాయులు , తల్లిదండ్రుల నుంచి మంచి మద్దతు లభించింది. ఈ స్పందన దృష్టిలో ఉంచుకుని, ఈ క్యాలెండర్‌ను మరింత ఉపయోగకరంగా మార్చేందుకు ఈ సంవత్సరం అనేక మార్పులు చేశారు.

పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి 

కొత్త పేరెంటింగ్ క్యాలెండర్‌లో తల్లిదండ్రులను భాగస్వామ్యాన్ని మరింత యాక్టివ్‌గా మార్చేందుకుఅనేక కార్యకలాపాలు ఉన్నాయి. ఈ కార్యకలాపాలు పిల్లల విద్యాభ్యాసంతోపాటు, వారి ప్రవర్తన, మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కేవలం పరీక్షలు లేదా ఫలితాల సమయంలోనే కాకుండా, సంవత్సరం పొడవునా తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యసన ప్రక్రియలో భాగం కావాలని బోర్డు కోరుకుంటోంది.

కొత్త అవసరాలకు అనుగుణంగా అప్‌డేషన్

ఈ సంవత్సరం క్యాలెండర్‌లో, మారుతున్న విద్యా వాతావరణానికి సిద్ధమవ్వడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, విభిన్న సామర్థ్యాలు గల పిల్లల అవసరాలను అర్థం చేసుకోవడం, వారికి మెరుగైన మద్దతును అందించడంపై ప్రాధాన్యత ఇచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లల అవసరాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి వర్క్‌షాప్‌లు, అవగాహన కార్యక్రమాలను కూడా సిఫార్సు చేయడం జరిగింది.

పాఠశాలలకు ప్రత్యేక విజ్ఞప్తి  

విద్యా సంవత్సరం పొడవునా పేరెంటింగ్ క్యాలెండర్‌ను క్రమం తప్పకుండా అమలు చేయాలని, అందులో సూచించిన కార్యక్రమాలను నిర్వహించాలని సీబీఎస్ఈ  అనుబంధ పాఠశాలలన్నింటికీ సూచించింది. దీనివల్ల పాఠశాలలకు, తల్లిదండ్రులకు మధ్య సంబంధాలు బలపడతాయని, పిల్లలకు వారి చదువుల కోసం సానుకూల, సహాయక వాతావరణం లభిస్తుందని బోర్డు పేర్కొంది. నేటి పిల్లలు చదువుతోపాటు మరెన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని కూడా బోర్డు అభిప్రాయపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, కుటుంబాలు, పాఠశాలలు కలిసి పనిచేస్తే, పిల్లలు ప్రతి స్థాయిలో మెరుగైన మద్దతును పొందగలరు.

Frequently Asked Questions

సీబీఎస్ఈ పేరెంటింగ్ క్యాలెండర్ అంటే ఏమిటి?

ఇది సీబీఎస్ఈ 2026-27 విద్యా సంవత్సరానికి ప్రారంభించిన కార్యక్రమం. పిల్లల విద్యతో పాటు వారి మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం.

పేరెంటింగ్ క్యాలెండర్ ప్రధాన లక్ష్యం ఏమిటి?

పిల్లల మానసిక, సామాజిక, భావోద్వేగ వికాసాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. పాఠశాలలు, కుటుంబాలు కలిసి పనిచేయడం వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం, అభ్యసన అనుభవం మెరుగుపడతాయని బోర్డు విశ్వసిస్తుంది.

పేరెంటింగ్ క్యాలెండర్ మొదటిసారి ఎప్పుడు ప్రారంభించబడింది?

పేరెంటింగ్ క్యాలెండర్ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆ సమయంలో పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుండి దీనికి మంచి మద్దతు లభించింది.

ఈ సంవత్సరం పేరెంటింగ్ క్యాలెండర్‌లో చేసిన ప్రధాన మార్పులు ఏమిటి?

తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడానికి అనేక కార్యకలాపాలు చేర్చబడ్డాయి. మారుతున్న విద్యా వాతావరణానికి సిద్ధమవ్వడం, విభిన్న సామర్థ్యాలు గల పిల్లల అవసరాలపై దృష్టి పెట్టడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget