అన్వేషించండి

Wife Kills Husband With Snake: చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!

Snake Bite Murder: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోరం జరిగింది. స్కూల్ బస్ డ్రైవర్‌తో వివాహేతర సంబంధం కోసం భర్తకు మత్తుమందు ఇచ్చి, బెడ్‌పై పామును వదిలి చంపింది భార్య .

Snake Bite Murder in UP:  ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో అత్యంత విస్తుగొలిపే ఒక కిరాతక క్రైమ్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉంటూ, పిల్లలకు బుద్ధులు చెప్పాల్సిన ఒక స్కూల్ యజమానురాలు, కేవలం తన కామవాంఛ కోసం కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా హతమార్చింది. స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న అతుల్ పన్వర్, దామిని దంపతుల జీవితంలోకి ఒక మూడో వ్యక్తి ప్రవేశించడంతో ఈ దారుణ ఉదంతం జరిగింది.  ఒక వైపు భార్యగా నటిస్తూనే, మరోవైపు భర్త ప్రాణాలు తీసేందుకు ఆమె వేసిన స్కెచ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

అతుల్ పన్వర్ నడుపుతున్న పాఠశాలలోనే బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న తుషార్ అనే యువకుడితో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడింది. రోజురోజుకూ వీరి అక్రమ సంబంధం శృతిమించడంతో, తమ ఎంజాయ్‌మెంట్‌కు భర్త అతుల్ అడ్డుగా ఉన్నాడని దామిని భావించింది. అతడిని శాశ్వతంగా ఈ లోకం నుంచి సాగనంపితేనే తామిద్దరం స్వేచ్ఛగా ఉండొచ్చని ప్రియుడు తుషార్‌తో కలిసి ఆమె ఒక భయంకరమైన హత్యాకాండకు ప్రణాళిక రచించింది. సాదాసీదాగా చంపితే పోలీసులు దొరకిపోతామని భావించిన ఈ లేడీ విలన్, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఒక వినూత్నమైన, నమ్మశక్యం కాని ప్లాన్ వేసింది.

ఈ క్రైమ్ ప్లాన్‌లో భాగంగా.. సహజ మరణంగా లేదా ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా చిత్రీకరించేందుకు  విషసర్పం అస్త్రాన్ని ఎంచుకున్నారు. తుషార్ తన స్నేహితులైన సోను, ఉదయ్‌ల సహాయంతో ఒక అత్యంత విషపూరితమైన నాగుపామును సంపాదించి రహస్యంగా దామినికి చేరవేశాడు. పథకం ప్రకారం ఒక రాత్రి దామిని తన భర్త అతుల్‌కు ఆహారంలో భారీగా మత్తుమందు కలిపి ఇచ్చింది. అతుల్ స్పృహ కోల్పోయి గాఢ నిద్రలోకి జారుకున్నాక, దామిని అత్యంత చల్లగా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించి ఆ విషసర్పాన్ని  నేరుగా భర్త పడుకున్న మంచంపై వదిలేసింది. ఆ పాము అతుల్‌ను తీవ్రంగా కాటు వేయడంతో, మత్తులోనే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

భర్త మరణించాక ఏమీ తెలియనట్లు దామిని హైడ్రామా మొదలుపెట్టింది. గదిలోకి పాము ఎలాగో వచ్చి కరిచిందని, తన భర్త చనిపోయాడంటూ బంధువుల ముందు కన్నీరుమున్నీరైంది. అయితే, ఆధునిక ఇళ్లలోకి, అదీ బెడ్‌రూమ్ మంచం పైకి అంత పెద్ద విషసర్పం అంత సులువుగా ఎలా రాగలదనే సందేహం పోలీసులకు వచ్చింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో మృతుడి శరీరంలో విషంతో పాటు మత్తుమందు ఆనవాళ్లు కూడా బయటపడటంతో పోలీసుల అనుమానం బలపడింది. రంగంలోకి దిగిన మీరట్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దామిని కాల్ డేటాను, ఆ రోజు రాత్రి ఆమె కదలికలను నిశితంగా పరిశీలించగా డ్రైవర్ తుషార్‌తో ఉన్న కనెక్షన్ బయటపడింది.  

పోలీసులు తమదైన శైలిలో దామినిని అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో ఆమె గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. తన అక్రమ సంబంధం బయటపడుతుందనే భయంతో, భర్తను వదిలించుకోవడానికే ప్రియుడితో కలిసి పాముతో కాటు వేయించి చంపినట్లు పోలీసుల ఎదుట బోరున ఏడుస్తూ ఒప్పుకుంది. దీంతో పోలీసులు నిందితురాలు దామినితో పాటు ఆమె ప్రియుడు తుషార్, అతడికి సహకరించిన సోను, ఉదయ్‌లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ బెడ్‌రూమ్ మర్డర్ మిస్టరీ కథనం ప్రస్తుతం మీరట్‌లో సంచలనంగా మారింది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget