అన్వేషించండి

National Film Awards 2026 Winners List: నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ఫుల్ లిస్ట్... ఉత్తమ నటిగా యామి... నటుడిగా ఇద్దరికి అవార్డు... సత్తా చాటిన తెలుగు సినిమాలు కల్కి, పుష్ప 2

72nd National Film Awards Winners List: 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతల వివరాలను ఇవాళ ప్రకటించారు. 2024లో విడుదలైన సినిమాలకు అవార్డులు ఇచ్చారు. ఎవరెవరు విజేతలుగా నిలిచారో చూడండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'ఆర్టికల్ 370' ఉత్తమ చిత్రం, యామీ గౌతమ్ ఉత్తమ నటి.
  • మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటులుగా సంయుక్తంగా ఎంపికయ్యారు.
  • 'అమరన్' ఉత్తమ దర్శకుడు, జీవీ ప్రకాష్ నేపథ్య సంగీత పురస్కారం.
  • 'కల్కి 2898 ఏడీ' ప్రజాదరణ, 'పుష్ప 2' స్క్రీన్‌ప్లే అవార్డులు.

72nd National Film Awards 2026 Winners List In Telugu: భారత ప్రభుత్వం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. జనవరి 1, 2024 నుంచి డిసెంబర్ 31, 2024 మధ్య విడుదలైన సినిమాలకు అవార్డులు ఇచ్చారు. ఎవరెవరికి అవార్డులు వచ్చాయి? బెస్ట్ యాక్టర్ ఎవరు? బెస్ట్ ఫిల్మ్ ఏది? ఏయే సినిమాలకు అవార్డులు వచ్చాయి? అనేది తెలుసుకోండి.

ఉత్తమ నటిగా యామి గౌతమ్...

ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్!

'ఆర్టికల్ 370' చిత్రానికి గాను... కథానాయిక యామీ గౌతమ్ ఉత్తమ నటి పురస్కారం వరించింది. 'భ్రమయుగం' సినిమాకు గాను ఉత్తమ నటుడి పురస్కారం మలయాళ కథానాయకుడు మమ్ముట్టిని వరించింది. ఆయనతో పాటు హిందీ సినిమా 'చందూ ఛాంపియన్'కు గాను బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కూడా అవార్డు అందుకోనున్నారు. 'బెస్ట్ యాక్టర్' అవార్డును ఇద్దరు తీసుకోనున్నారు. 
 
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన 'అమరన్'ను ఉత్తమ సినిమా పురస్కారం వరించింది. ఆ సినిమాకు గాను ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్ కుమార్ పురస్కారం అందుకోనున్నారు. అలాగే, ఆ సినిమాను తెరకెక్కించిన రాజ్ కుమార్ పెరియసామిని 'ఉత్తమ దర్శకుడి' పురస్కారం వరించింది. ఎడిటింగ్ విభాగంలోనూ 'అమరన్'కు అవార్డు వచ్చింది. ఉత్తమ బాలల సినిమాగా '35 ఒక చిన్న కథ కాదు' నిలిచింది. 'ఆర్టికల్ 370' ఉత్తమ సినిమాగా నిలిచింది. ఆ సినిమాకు పాటలు అందించిన శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ స్వరకర్త (సంగీత దర్శకుడు - పాటలు)గా అవార్డు అందుకోనున్నారు. 
  • ఉత్తమ సినిమా: ఆర్టికల్‌ 370 (ఆదిత్య సుహాస్‌ జంబాలే)
  • ఉత్తమ బాలల సినిమా: 35 ఒక చిన్న కథ కాదు
  • ఉత్తమ నటుడు (ఇద్దరికి): కార్తిక్‌ ఆర్యన్‌ (చందూ ఛాంపియన్‌), మమ్ముట్టి (భ్రమయుగం)
  • ఉత్తమ నటి: యామి గౌతమ్‌ (ఆర్టికల్‌ 370)
  • ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్‌ పెరియసామి (అమరన్‌)
  • ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): శాశ్వత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
  • ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడు: జీవీ ప్రకాశ్ కుమార్
  • ఉత్తమ ఎడిటర్: ఆర్ కలైవానన్ (అమరన్)

పాపులర్ సినిమాగా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'...

మాటల రచయితగా 'లక్కీ భాస్కర్'కు వెంకీ అట్లూరి

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో అవార్డు వచ్చింది. 'బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్' విభాగంలో నితిన్ జహాన్ చౌదరి ఆ అవార్డు అందుకోనున్నారు. అలాగే, బెస్ట్ పాపులర్ సినిమాగా 'కల్కి 2898 ఏడీ' నిలిచింది. ఉత్తమ మాటల రచయితగా 'లక్కీ భాస్కర్' సినిమాకు గాను ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి అవార్డు అందుకోనున్నారు.
  • ఉత్తమ ప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ (నాగ్‌ అశ్విన్)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైనర్‌: కల్కి 2898 ఏడీ (నితిన్‌ జిహానీ చౌదరి)
  • ఉత్తమ సహాయ నటుడు: సంయ్‌ మిశ్రా (భక్షక్‌)
  • ఉత్తమ సహాయ నటి (ఇద్దరికి): రూపశ్రీ వర్కాడే (మిథ్య), సచన నమిదాస్‌ (మహారాజ)

నిహారిక 'కమిటీ కుర్రోళ్ళ'కు బెస్ట్‌ తెలుగు ఫీచర్ ఫిల్మ్

మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు తెలుగులో 'బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా అవార్డు వచ్చింది. ఆ సినిమాతో యదువంశీ దర్శకుడిగా పరిచయం అవ్వగా... సుమారు 11 మంది కొత్తవాళ్ళను తెలుగు తెరకు పరిచయం చేశారు నిహారిక. ఆ సినిమాకు మేకప్ విభాగంలో మరో అవార్డు వచ్చింది. 'బెస్ట్ మేకప్' అవార్డు పి రవి కుమార్ అందుకోనున్నారు. 

  • ఉత్తమ తెలుగు సినిమా - కమిటీ కుర్రోళ్ళు
  • ఉత్తమ మలయాళ సినిమా - ఫెమించి ఫాతిమా
  • ఉత్తమ తమిళ సినిమా - రాయన్ 
  • ఉత్తమ హిందీ సినిమా - శ్రీకాంత్
  • ఉత్తమ కన్నడ సినిమా - మిథ్య

కాస్ట్యూమ్స్ విభాగంలో 'పుష్ప 2'కు అవార్డు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమాకు బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో అవార్డు వచ్చింది. దీపాలి నూర్, షీతల్ శర్మ సంయుక్తంగా అవార్డు అందుకోనున్నారు. 'పుష్ప 2'కు స్క్రీన్ ప్లే విభాగంలో దర్శకుడు సుకుమార్ అవార్డు అందుకోనున్నారు. ఆ సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. '35 ఒక చిన్న కథ కాదు' సినిమాకు గాను అనుదీప్ పోతుల 'బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్' అవార్డు అందుకోనున్నారు.
  • ఉత్తమ స్క్రీన్‌ ప్లే (ఒరిజినల్‌): పుష్ప2 (సుకుమార్‌)
  • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్: పుష్ప2 (దీపాలి నూర్‌, సీతల్‌ శర్మ)
  • ఉత్తమ మేకప్‌: కమిటీ కుర్రాళ్లు (పి. రవికుమార్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు): లక్కీ భాస్కర్‌ (వెంకీ అట్లూరి)

విజయ్ సేతుపతి 'మహారాజా'కు బెస్ట్ స్టంట్స్!

విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 'మహారాజా' చిత్రానికి స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు వచ్చింది. 'స్త్రీ 2'లో తమన్నా స్టెప్స్ వేసిన 'ఆజ్ కి రాత్' సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు కొరియోగ్రఫీ అందించిన విజయ్ గంగూలీ 'ఉత్తమ నృత్య దర్శకత్వం' విభాగంలో అవార్డు అందుకోనున్నారు. ఆర్ కలైవానన్‌ను జాతీయ పురస్కారం వరించింది. సౌండ్ డిజైన్ విభాగంలో 'భూల్ భులాయ్యా 3'కు మానస్ చౌదరిని అవార్డు వరించింది. 

Also ReadAnna Konidela Visits Thirumala - పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు

Frequently Asked Questions

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఏ సినిమాలకు ప్రకటించారు?

జనవరి 1, 2024 నుండి డిసెంబర్ 31, 2024 మధ్య విడుదలైన సినిమాలకు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. ఈ అవార్డులను భారత ప్రభుత్వం అందించింది.

ఉత్తమ నటుడు, నటి పురస్కారాలు ఎవరికి వచ్చాయి?

ఉత్తమ నటిగా యామి గౌతమ్ ('ఆర్టికల్ 370') అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటులుగా మమ్ముట్టి ('భ్రమయుగం'), కార్తీక్ ఆర్యన్ ('చందూ ఛాంపియన్') పురస్కారాలు గెలుచుకున్నారు.

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు అవార్డులు ఏ చిత్రాలకు, ఎవరికి వచ్చాయి?

ఉత్తమ సినిమాగా 'ఆర్టికల్ 370' నిలిచింది. 'అమరన్' సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా పురస్కారం అందుకున్నారు.

ఉత్తమ తెలుగు సినిమా అవార్డు ఏ చిత్రానికి లభించింది?

మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఉత్తమ తెలుగు సినిమా పురస్కారం లభించింది. ఈ చిత్రానికి మేకప్ విభాగంలో కూడా అవార్డు వచ్చింది.

ఏ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ చిత్రం అవార్డు లభించింది? 'పుష్ప 2'కు ఏ విభాగాల్లో అవార్డులు వచ్చాయి?

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' ఉత్తమ ప్రజాదరణ చిత్రం అవార్డు గెలుచుకుంది. 'పుష్ప 2'కు ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) మరియు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డులు వచ్చాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Vishwanath And Sons Pre Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget