అన్వేషించండి

Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు

MBBS student Suicide | నల్గొండ జిల్లా మునుకుంట్ల గ్రామంలో ఎంబీబీఎస్ విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న, యువకుడు చరణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరిద్దరి మృతదేహాలు ఉరికి వేలాడుతూ కనిపించాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నల్గొండలో యువతీ యువకుల ఆత్మహత్యలు, ప్రేమ వేధింపుల ఆరోపణలు.
  • లక్ష్మీప్రసన్న వేధింపులు తాళలేక ఆత్మహత్య, ఆ తర్వాత రామ్ చరణ్.
  • పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసులు, అన్ని కోణాల్లో దర్యాప్తు.
  • పోస్ట్‌మార్టం, కాల్ డేటా ద్వారా నిజానిజాలు తేలుస్తామన్నారు అధికారులు.

కట్టంగూర్: నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఓ యువతీయువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. లక్ష్మీ ప్రసన్న అనే ఎంబీబీఎస్ విద్యార్థిని యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో భయంతో అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్ అనే యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మునుకుంట్లకు చెందిన సుక్క లింగయ్య, యాదమ్మ దంపతుల చిన్న కుమార్తె లక్ష్మీ ప్రసన్న (21)కు డాక్టర్ కావాలని, ప్రజలకు సేవ చేయాలని కోరిక ఉండేది. చదువులో రాణించి సత్తాచాటిన లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. పరీక్షల ప్రిపరేషన్ కోసం ఇచ్చిన సెలవుల్లో గ్రామానికి తిరిగి వచ్చిన క్రమంలో శుక్రవారం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. మరోవైపు, అదే గ్రామానికి చెందిన రామ్ చరణ్(25) మృతదేహం శనివారం (జూలై 18) తాటి చెట్టుకు వేలాడుతూ కనిపించింది.

స్థానికుల సమాచారం ప్రకారం, ప్రసన్న మృతిలో చరణ్ పాత్ర ఉందేమోనని ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమెను వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు పలుమార్లు యువకుడు రామ్‌ చరణ్‌ను మందలించినా అతడు మారలేదు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తూనే ఉన్నాడు. అందువల్లే లక్ష్మీప్రసన్న ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చరణ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఇద్దరి ఆత్మహత్యలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నల్గొండ పోలీసులు ఏమన్నారంటే?
నల్గొండ పోలీసు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మేం అనుమానాస్పద మృతిగా విడివిడిగా కేసులు నమోదు చేశాము. ప్రేమ వ్యవహారం, వేధింపుల ఆరోపణలతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టాం. నిజనిజాలను తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం రిపోర్ట్, కాల్ డేటా రికార్డులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల వాంగ్మూలం సేకరించనున్నాం. ప్రజలు వీరి మృతిపై ఎలాంటి వార్తలు ప్రచారం చేయొద్దని, దర్యాప్తు సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’అని చెప్పారు. వీరిద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపినట్లు అధికారి తెలిపారు.

కుటుంబ సభ్యులు, గ్రామస్తుల స్టేట్‌మెంట్ల నమోదు
కట్టంగూర్ పోలీసులు అటు ప్రసన్న బంధువులు, ఇటు చరణ్ కుటుంబ సభ్యులు, అలాగే వారిద్దరి గురించి తెలిసిన గ్రామస్తులను ప్రశ్నించి స్టేట్‌మెంట్లను నమోదు చేశారు. వారిలో ఎవరిపైనైనా మానసిక ఒత్తిడి, బెదిరింపులు లేదా వేధింపులు ఉన్నట్లు  ఫిర్యాదులు, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌లు ఏవైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చే వరకు అధికారులు ఇద్దరి మరణాలను అనుమానాస్పద మృతిగానే భావిస్తామని చెప్పారు. యువతిపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం లేదా మరేదైనా నేరానికి సంబంధించిన ఆధారాలు లభిస్తే అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు.

 

Frequently Asked Questions

నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఏం జరిగింది?

మునుకుంట్ల గ్రామంలో లక్ష్మీ ప్రసన్న అనే ఎంబీబీఎస్ విద్యార్థిని, రామ్ చరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యకు కారణం ఏమిటి?

రామ్ చరణ్ అనే యువకుడి వేధింపులు భరించలేక లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చరణ్ ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేశారు.

రామ్ చరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?

లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకున్న గంటల వ్యవధిలో భయంతో రామ్ చరణ్ కూడా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఆత్మహత్యలపై పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు?

పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేసి, ప్రేమ వ్యవహారం, వేధింపుల ఆరోపణలతో సహా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget