Sai Durga Tej: దయచేసి హెల్మెట్ పెట్టుకోండి, అదే నన్ను కాపాడింది: సాయి దుర్గ తేజ్
హెల్మెల్ లేకపోతే తాను ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదన్నారు నటుడు సాయి దుర్గ తేజ్. బైక్ మీద వెళ్లే వాళ్లు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేశారు.
Sai Durga Tej About Helmet: మెగా హీరో సాయి దుర్గ తేజ్ వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన సినిమాలు మంచి హిట్స్ అందుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదం తర్వాత విడుదలైన ‘విరూపాక్ష’ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి నటించి ‘బ్రో’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాయన ప్రస్తుతం ‘SDT18’ సినిమా చేస్తున్నారు. ఆయన కెరీర్ లో 18వ సినిమాగా తెరకెక్కుతున్నన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
దయచేసి హెల్మెట్ పెట్టుకోండి- సాయి ధరమ్ తేజ్
తాజాగా ABP సదరన్ రైజింగ్ సమ్మిట్ 2024లో పాల్గొన్న సాయి దుర్గ తేజ్ కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. తాను ఈ రోజు ప్రాణాలతో బతికి ఉన్నాననంటే దానికి కారణం హెల్మెట్ అన్నారు. బైక్ స్టార్ట్ చేశారంటే తలకు హెల్మెట్ ఉండేలా చూసుకోవాలన్నారు. “మీ అందరికీ నమస్కరించి చెప్తున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను. లేడీస్, కెమెరా మెన్ అందరూ హెల్మెట్ ధరించండి. హెల్మెట్ నా జీవితాన్ని కాపాడింది. నా జీవితాన్ని తిరిగి ఇచ్చింది. నా తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని భాషల్లో చెప్తున్నాను. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ప్రాణాలు కాపాడుకోండి” అని కోరారు.
Please wear your helmet, while riding your bike…it’s a kind request from my end 🙏🏼 https://t.co/MaxiebO4LS
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 25, 2024
జూబ్లీహిట్స్ లో సాయి దుర్గ తేజ్ కు రోడ్డు ప్రమాదం
2021లో సెప్టెంబర్ 11న సాయి దుర్గ తేజ్ కు జూబ్లీహిట్స్ లో యాక్సిడెంట్ అయ్యింది. దుర్గం చెరువు మీద నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మీది నుంచి స్పోర్ట్స్ బైక్ మీద వెళ్తుంటే స్కిడ్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు పెద్ద దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లిపోయారు. నుదుటి మీద, ఛాతి భాగంలో, కాళ్లకు బలమైన గాయాలు తగిలాయి. వెంటనే అతడిని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఒకానొక సమయంలో పరిస్థితి విషమంగానే ఉందనే వార్తలు వినిపించాయి. చాలా రోజుల పాటు ఆయన హాస్పిటల్ లోనే చికిత్స తీసుకున్నారు. సుమారు ఏడాదికి పైగా ఇంటికే పరిమితం అయ్యాడు. అప్పటి నుంచి తను ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలనే ప్రచారం చేస్తున్నారు. హెల్మెట్ బైక్ నడిపే వ్యక్తి ప్రాణాలను కాపాడటంతో పాటు వారి కుటుంబానికి అండగా నిలిచే అవకాశం ఉందన్నారు. ఏమవుతుంది లే అనే నిర్లక్ష్యం చాలా మంది మీద ప్రభావం చూపిస్తుందన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సాయి దుర్గ తేజ్ ప్రజలకు సూచించారు.
Read Also: జ్యోతికతో సినిమా, సిగ్గు పడుతూ సూర్య చెప్పిన సమాధానం ఏంటో తెలుసా?