Manchu Vishnu : ఇండస్ట్రీ ఒకే మాట మీద ఉండాలి.. టిక్కెట్ రేట్ల వివాదంపై మంచు విష్ణు స్పందన !
ఏపీ ప్రభుత్వంతో ఏర్పడిన సినిమా టిక్కెట్ రేట్ల వివాదంపై ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలని మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. టిక్కెట్ రేట్లపై వైఎస్ హయాంలో వచ్చిన జీవోపై చర్చ జరగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏర్పడిన సినిమా టిక్కెట్ల వివాదంలో ఫిలిం చాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని "మా"అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్ లో జరిగిన మన్యంరాజు అనే సినిమా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంద్రభంగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో టిక్కెట్ రేట్ల అంశాన్ని ప్రస్తావించారు. సినిమా టిక్కెట్ల ధరలు తెలంగాణలో పెంచితే .. ఏపీలో తగ్గించారని కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారన్నారు. విషయం దీనిపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని మంచు విష్ణు పిలుపునిచ్చారు.
ఏపీలో డ్రగ్స్, కేసినోపై రాజ్యసభలో ప్రస్తావన , కనకమేడల ప్రసంగాన్ని అడ్డుకున్న వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు !
టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదన్నారు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. తాను ఒక్కడిని విడిగా మాట్లాడటం వల్ల సమస్య పక్కదారి పడుతుందన్నారు. అలాంటి పనులు చేయబోనన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తోందన్నారు. ప్రస్తుతం సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని, కలిసి మెలసి ఓ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. వ్యక్తిగతంగా నా నిర్ణయంతో పని లేదని, ఎవరూ నా అభిప్రాయం అడగడం లేదని ఆయన స్పష్టం చేశారు.. సినిమా టిక్కెట్స్ పై వైఎస్సార్ హయాంలోనే ఓ జీవో వచ్చిందని, దానిపై కూడా చర్చ జరగాలన్నారు.
మార్చి మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ! రాజధానులు, కొత్త జిల్లాల బిల్లులు ఖాయం ?
టిక్కెట్స్ ధరల నిర్ణయానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటికే కలిసిందని గుర్తు చేశారు. వారు అడిగితే తాము కూడా కలుస్తామని స్పష్టం చేశారు. చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ మీటింగే అని, దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించ కూడదని స్పష్టం చేశారు. "మా" అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడుతానన్నారు. తనను విమర్శిస్తున్నారు అంటే తాను పాపులర్ అవుతున్నట్లేనని సెటైర్ వేశారు.
తిరుపతిలో మోహన్ బాబు యూనివర్శిటీకి ఇటీవల అనుమతులు లభించాయి. ఈ ఏడాదే యూనివర్శిటీని ప్రారంభిస్తామని అందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని మంచు విష్ణు ప్రకటించారు. సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఇస్తమన్నారు. మంచు కుటుంబానికి తిరుపతిలో విద్యానికేతన్ విద్యాసంస్థలు ఉన్నాయి. వాటన్నింటినీ మోహన్ బాబు యూనివర్శిటీ కిందకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి.