By: ABP Desam | Updated at : 13 Apr 2022 12:15 PM (IST)
రణబీర్-అలియా న్యూ జర్నీ
బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం బీటౌన్ మొత్తం రణబీర్, అలియాభట్ ల పెళ్లి గురించే చర్చించుకుంటోంది. ఈ జంట ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. కొందరు మాత్రం ఏప్రిల్ 15న పెళ్లి జరగబోతుందని అంటున్నారు.
ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ జంట పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో 'బ్రహ్మాస్త్ర' టీమ్ స్పెషల్ గా విష్ చేసింది. ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ.. రణబీర్, అలియాలకు శుభాకాంక్షలు చెప్పారు. వారణాసిలో చిత్రీకరించిన 'కేసరియా' అనే మొదటి పాటకు సంబంధించిన చిన్న టీజర్ ను దర్శకుడు అయాన్ ముఖర్జీ విడుదల చేశారు. ఈ సాంగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
'రానున్న రోజుల్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మా ఈషా, శివల జీవితాల్లో ప్రేమ, అదృష్టం, వెలుగులు నిండాలని కోరుకుంటూ టీమ్ బ్రహ్మాస్త్ర నుంచి ఈ విషెస్' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. అలానే దర్శకుడు అయాన్.. అలియా, రణబీర్ లతో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
Mission Impossible 7 Trailer - ‘మిషన్: ఇంపాజిబుల్ 7’ ట్రైలర్: టామ్ క్రూజ్ రియల్ స్టంట్స్, చివరి సీన్ అస్సలు మిస్ కావద్దు!
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Naga Chaitanya: చైతు కోసం 'నాగేశ్వరరావు' టైటిల్?
Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్ఫ్లవర్ ఆయిల్ ధరపై..!