Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే
Mahesh Babu Mania Begins: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' సినిమా చిత్రీకరణ ఒక్క పాట మినహా కంప్లీట్ అయ్యిందని చిత్రబృందం వెల్లడించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata Movie). చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఒక్క పాట మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని నేడు చిత్ర బృందం వెల్లడించింది. 'సర్కారు వారి పాట' మేనియా మొదలైందని, ఇక నుంచి ఎగ్జైటింగ్ అప్‌డేట్స్ ఇస్తామని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.
మహేష్ బాబు సరసన కీర్తీ సురేష్ (Keerthy Suresh) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ (Parashuram) దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో తొలి పాట 'కళావతి...' విడుదలైన సంగతి తెలిసిందే. 130 ప్లస్ మిలియన్ రికార్డ్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకు వెళుతోంది. 'సర్కారు వారి పాట'లో రెండో పాట 'పెన్నీ...'కు 26 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలపై తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల (Sarkaru Vaari Paata Release On May 12, 2022) కానుంది.
Also Read: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం