News
News
వీడియోలు ఆటలు
X

Nidhhi Agerwal - Condoms Promotion: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం - సోషల్ మీడియాలో దుమ్ము దుమారం

Nidhhi Agerwal Gets Trolled: కండోమ్స్‌కు నిధి అగర్వాల్ ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దాంతో ట్రోలింగ్ మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

FOLLOW US: 
Share:

Nidhhi Agerwal promotes condoms: హీరోయిన్ నిధి అగర్వాల్ కండోమ్స్‌కు ప్రచారం కల్పిస్తున్నారు. మీరు చదివింది నిజమే... కండోమ్స్‌కు ఆమె పబ్లిసిటీ చేస్తున్నారు. ఒక కంపెనీకి చెందిన కండోమ్స్ ఉపయోగించమని ఆమె సలహా ఇచ్చారు. ఆ కండోమ్స్‌తో అనుభూతి బావుంటుందని చెప్పుకొచ్చారు. అంతే కాదు, ఆ కంపెనీకి చెందిన కండోమ్ యాడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ పేజీల్లో పోస్ట్ చేశారు. నిధి అగర్వాల్ పోస్టులు చూసి చాలా మంది షాక్ అయ్యారు. మరికొంత ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

Nidhhi Agerwal criticized for posting advertisement promoting Condoms: నిధి అగర్వాల్ పోస్టుల కింద కొంత మంది అసభ్యకరమైన రీతిలో, ఇక్కడ రాయలేని  భాషలో పోస్టులు చేశారు. కండోమ్స్ మీరు ఉపయోగించారా? అని కొందరు ప్రశ్నించారు. అనుభవంతో చెబుతున్నారా? అని కొందరు వెటకారంగా అడిగారు.  ఇటువంటి యాడ్స్ చేయవద్దని కొందరు సలహా ఇచ్చారు. మొత్తం మీద సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ కండోమ్స్ ప్రచారం దుమ్ము దుమారం రేపుతోంది. ఆమె విమర్శలకు గురి కావడం ఇది తొలిసారి కాదు. గతంలో ఒక లిక్కర్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ... ఆమె పోస్ట్ చేశారు. అప్పుడు కూడా ఆమెను నెటిజన్స్ విమర్శించారు.

సాధారణంగా నిధి అగర్వాల్ వేసుకునే దుస్తులు విమర్శలకు కారణం అవుతూ ఉంటాయి. అందాల ప్రదర్శన ఎక్కువ చేస్తారని కొందరు ఆమెను ట్రోల్స్ చేశారు. ఇప్పుడు మాత్రం లిక్కర్, కండోమ్స్ చేయడంతో డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అంటూ కొందరు విరుచుకుపడుతున్నారు. లిక్కర్ యాడ్ పోస్ట్ చేసినప్పటి కంటే... కండోమ్ యాడ్ పోస్ట్ చేసినప్పుడు ఆమెపై వ్యతిరేకత ఎక్కువైంది. అదే సమయంలో ఆమెకు మద్దతుగా నిలిచిన వారు కూడా ఉన్నారు. దుస్తులపై విమర్శలు వచ్చినప్పుడు నిధి అగర్వాల్ ఘాటుగా బదులు ఇచ్చారు. ఇప్పుడు ఏం అంటారో చూడాలి.

Also Read: ఏప్రిల్ రెండో వారంలో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నిధి అగర్వాల్ తెలుగులో పాపులర్ అయ్యారు. అంతకు ముందు అక్కినేని హీరోలు నాగ చైతన్యతో 'సవ్యసాచి', అఖిల్‌తో 'మిస్టర్ మజ్ను' సినిమాలు చేశారు. తర్వాత మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తొలి సినిమా 'హీరో'లో కథానాయికగా నటించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు'లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయని నిధి అగర్వాల్ ఆశిస్తున్నారు.  

Also Read: ప్రభాస్ అభిమానులు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది

Published at : 12 Apr 2022 07:30 AM (IST) Tags: Nidhi Agarwal Niddhi Agerwal Niddhi Agerwal Trolled Nidhi Agarwal Trolled Niddhi Agerwal Condoms Ad Niddhi Agerwal Condoms Post Nidhhi Agerwal Promotes Condoms Comments On Niddhi Agerwal

సంబంధిత కథనాలు

Prabhas - Tirumala Darshan : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్

Prabhas - Tirumala Darshan : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

షారుక్‌‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?

టాప్ స్టోరీస్

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్​, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు