News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Fake Universities: దేశంలో 20 ఫేక్ యూనివర్సిటీలు, వీటిల్లో డిగ్రీ చేస్తే ఇక అంతే సంగతులు - యూజీసీ వార్నింగ్

దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది.

FOLLOW US: 
Share:

దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీలు అధికంగా దేశరాజధానిలో ఉన్నట్లు యూజీసీ తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. ఢిల్లీ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగు, ఏపీలో రెండు, బెంగాల్‌లో రెండు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితోపాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలలో ఒక్కోటి చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. 

ఈ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. యూజీసీ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా పలు సంస్థలు డిగ్రీలు ప్రదానం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు యూజీసీ తెలిపింది. అలాంటి విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే డిగ్రీలను ఉన్నత విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించబోమని.. ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని యూజీసీ తేల్చి చెప్పింది. ఈ యూనివర్సిటీలకు అసలు డిగ్రీలు ఇచ్చే అధికారమే లేదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషీ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని ఫేక్ యూనివర్సిటీలు..
1) గుంటూరులోని కాకుమానివారితోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ.
2) విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ ఆఫ్ ఇండియాను నకిలీవిగా యూజీసీ ప్రకటించింది. 

ఢిల్లీలో ఫేక్ యూనివర్సిటీలు..
3) ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ 
4) కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్- దర్యాగంజ్
5) యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ 
6) వొకేషనల్ యూనివర్సిటీ 
7) ఏడీఆర్ సెంట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ 
8) ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ 
9) విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ 
10) ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం)

ఉత్తరప్రదేశ్‌లోని ఫేక్ యూనివర్సిటీలు..
11) గాంధీ హిందీ విద్యాపీఠ్ 
12) నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి 
13) నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)
14) భారతీయ శిక్షా పరిషత్ ఉన్నట్టు తెలిపింది.

పశ్చిమబెంగాల్‌లోని ఫేక్ యూనవర్సిటీలు..
15)  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ 
16)  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్

కర్ణాటలోని ఫేక్ యూనివర్సిటీలు..
17) బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ.

కేరళలోని ఫేక్ యూనివర్సిటీలు..
18) సెయింట్ జాన్స్ యూనివర్సిటీ.

మహారాష్ట్రలోని ఫేక్ యూనివర్సిటీలు..
19) రాజా అరబిక్ యూనివర్సిటీ

పుదుచ్ఛేరిలోని ఫేక్ యూనివర్సిటీలు..
20) శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్

యూజీసీ ప్రకటించిన ఫేక్ యూనివర్సిటీల జాబితా కోసం క్లిక్ చేయండి..

ALSO READ:

తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!
తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

కాళోజీ  హెల్త్ వర్సిటీలో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్సు, డిగ్రీ అర్హత చాలు
తెలంగాణలో మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) కోర్సులో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశపరీక్షను ఆగస్టు 27న నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌ 2న ఫలితాలు వెల్లడించనున్నారు. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 03 Aug 2023 05:51 AM (IST) Tags: UGC University Grants Commission Education News in Telugu State-wise list of Fake Universities Fake Universities in India List of Fake Universities

ఇవి కూడా చూడండి

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

PGECET Seats: పీజీఈసెట్‌ చివరి విడత సీట్ల కేటాయింపు పూర్తి, 3592 మందికి ప్రవేశాలు

UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

UK Visa Fee Hike: యూకే వీసా ఫీజు పెంపు విద్యార్థులు, కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

Inter Admissions: ఇంటర్‌ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్

టాప్ స్టోరీస్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్‌ మూసివేత

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!

MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్‌! టీమ్‌ఇండియాకు నెర్వస్‌ ఫీలింగ్‌!