అన్వేషించండి

SVIMS: తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్/ తెలంగాణకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

వివరాలు..

* స్విమ్స్‌లో పీజీ ప్రవేశాలు - 2023

కోర్సులు-సీట్ల సంఖ్య..

➥ ఎంఎస్సీ(నర్సింగ్): 33 సీట్లు

➥ మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ(ఎంపీటీ): 27 సీట్లు

➥ ఎంఎస్సీ ఎకోకార్డియోగ్రఫీ: 01 సీటు

➥ ఎంఎస్సీ కార్డియాక్ కాథెటరైజేషన్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ: 01 సీటు

➥ ఎంఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ: 02 సీట్లు

➥ ఎంఎస్సీ కార్డియో-పల్మనరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ: 02 సీట్లు

➥ ఎంఎస్సీ క్లినికల్ వైరాలజీ: 02 సీట్లు

➥ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ సైన్స్: 09 సీట్లు

➥ పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్స్: 18 సీట్లు

పోస్ట్ బేసిక్ డిప్లొమా స్పెషలైజేషన్లు: కార్డియాక్ ఇంటెన్సివ్ కేర్ అండ్ క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ నర్సింగ్, సీటీ సర్జరీ నర్సింగ్, పెరిటోనియల్ డయాలసిస్ నర్సింగ్, హెమో డయాలసిస్ నర్సింగ్, రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నర్సింగ్.

కోర్సు వ్యవధి: రెండేళ్లు. పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రోగ్రామ్‌ మాత్రం ఏడాది ఉంటుంది.

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు పూరించి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.

ఎంపిక విధానం: పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్‌కు మాత్రం బీఎస్సీ నర్సింగ్ కోర్సు అకడమిక్ మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. మిగిలిన కోర్సులకు ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.5,900; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.4,956 చెల్లించాలి. ''The Director, SVIMS, Tirupati'' పేరిట తిరుపతిలో చెల్లించాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. దరఖాస్తుతోపాటు సర్టిఫికేట్ కాపీలు, డిడి జతచేసి పంపాల్సి ఉంటుంది. డిడి లేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar, 
Sri Venkateswara Institute of Medical Sciences, 
Alipiri Road, Tirupati - 517 507.

ముఖ్యమైన తేదీలు...

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: 11.08.2023 (5 PM)

➥ ప్రవేశ పరీక్ష (పోస్ట్ బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్ మినహా): 18.08.2023.

Notification

Application

Website

ALSO READ:

అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

కొత్త మెడికల్ కాలేజీల కన్వీనర్‌ కోటా పీజీ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు
తెలంగాణలో 2014 జూన్‌ 2 తేదీ తర్వాత ప్రారంభించిన  అన్ని మెడికల్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్‌ కోటా పీజీ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ జులై 29న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 117 సీట్లు అదనంగా రాష్ట్ర విద్యార్థులకు దక్కనున్నాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget