అన్వేషించండి

BRAOU Admissions: అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.

కోర్సుల వివరాలు..

1) డిగ్రీ కోర్సులు

- బీఏ

- బీకామ్

- బీఎస్సీ

- బీఎల్‌ఐఎస్సీ.

కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)

2) పీజీ కోర్సులు: ఎంబీఏ, ఎంఏ(జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ), ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐఎస్సీ.

3) డిప్లొమా కోర్సులు: సైకలాజికల్ కౌన్సెలింగ్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌‌మెంట్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(హెచ్ఆర్‌ఎం), ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్,  ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా(తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.

4) సర్టిఫికేట్ కోర్సులు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.

అర్హతలు: 

➥ డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే. 

➥ పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

➥ డిప్లొమా కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.

➥ సర్టిఫికేట్ కోర్సులకు పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Notification

Application Form for BA, BCom & BSc Courses

UG Courses Details

Application Form for PG(MA/M.Sc/M.Com)/ Diploma and Certificate  Programmes

PG, Other Courses Details

ALSO READ:

నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Meets KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్ రావు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చిస్తున్న కేసీఆర్‌
KTR Meets KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్ రావు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చిస్తున్న కేసీఆర్‌
AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Advertisement

వీడియోలు

6 Ball Over Behind Story | 6 బాల్ ఓవర్ కోసం ఇంగ్లండ్-ఆసీస్ మధ్య దశాబ్దాల ఫైట్‌ జరిగిందా? | ABP Desam
గంభీర్-గిల్ వల్లే అంతా! ఇలా అయితే సిరీస్ కూడా కష్టమే!
స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ సింగ్.. ఇద్దరికీ ఎంత తేడా?
ఇండియా మ్యాచ్.. రూ.60కే టికెట్
గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Meets KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్ రావు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చిస్తున్న కేసీఆర్‌
KTR Meets KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్, హరీష్ రావు.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చిస్తున్న కేసీఆర్‌
AP Inter Exams: ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
ఏపీ ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు, పాస్ మార్కులలో కీలక మార్పులు..
Chandrababu UAE Tour Schedule: నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు.. విశాఖ సమ్మిట్‌కు పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
శ్రీశైలం కార్తీక మాసోత్సవాలు: స్పర్శ దర్శనం, ప్రత్యేక మార్పుల గురించి మల్లన్న భక్తులకు ముఖ్య సూచనలు!
Stock Market Holiday: నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
నేడు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా.. లేక హాలిడే ఇచ్చారా? ఈరోజు ఎందుకంత స్పెషల్
Ocean’s Deepest Secrets : మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
మనిషికి తెలియని రహస్య ప్రపంచం.. అసలు సముద్రంలో ఏముంది? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు
Nara Lokesh Australia Tour: ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్
ఏపీలో గ్రిఫిత్ వర్సిటీ ఇండియా సెంటర్ ఏర్పాటు చేయండి- వైస్ ప్రెసిడెంట్ తో లోకేష్
AP and Telangana Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం, ఏపీలో వారం రోజులు, తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు
Embed widget